ప్లే బాయ్‌గా సందీప్‌.. గ్లామరస్‌గా తమన్నా | Next Enti Movie Teaser Released | Sakshi
Sakshi News home page

Nov 14 2018 5:35 PM | Updated on Sep 15 2019 12:38 PM

Next Enti Movie Teaser Released - Sakshi

‘ఫనా, హమ్‌ తుమ్‌’ వంటి బాలీవుడ్‌ హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన కునాల్‌ కోహ్లి సందీప్‌ కిషన్‌కు హిట్‌ అందిస్తాడా?

అబ్బాయి అమ్మాయి కలుసుకోవడం.. ప్రేమించుకోవడం.. విడిపోవడం.. ‘నెక్ట్స్‌ ఏంటి?’. వారిద్దరి మధ్య నడిచింది ప్రేమనా, రొమాన్సా లేక కామమా ఎవరికి తెలుసు. ఈ అంశంతోనే బాలీవుడ్‌ డైరెక్టర్‌ కునాల్‌ కోహ్లి తెలుగులో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సందీప్‌ కిషన్‌, తమన్నా జంటగా, నవదీప్‌, పూనమ్‌ కౌర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రైనా జోషి, అక్షయ్‌ పూరి నిర్మించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 

వరస ఫ్లాఫ్‌లతో సతమతమవుతున్న సందీప్‌ కిషన్‌ ఈ చిత్రంలో ప్లే బాయ్‌ రోల్‌ పోషిస్తుండగా, మిల్క్‌ బ్యూటీ తమన్నా మరోసారి గ్లామరస్‌ రోల్‌తో ఆకట్టుకుంది. నవదీప్‌ ఏజ్డ్‌ రోల్‌లో డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్య​క్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. ‘ఫనా, హమ్‌ తుమ్‌’ వంటి బాలీవుడ్‌ హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన కునాల్‌ కోహ్లి సందీప్‌ కిషన్‌కు హిట్‌ అందిస్తాడని ఎంతో నమ్మకంతో ఉన్నాడు. ఇక ఈ చిత్రానికి లియోన్‌ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement