ఆటోవాలా హైలైట్

అరాచకాలు, అన్యాయాలు చేస్తూ మాఫియా డాన్‌గా మారిన వ్యక్తిని పోలీసులు చివరికి ఎలా అంతమొందించారు? అనే కథతో రూపొందుతోన్న చిత్రం ‘హైటెక్ కిల్లర్’. జాతీయ బాడీ బిల్డర్ బల్వాన్ హీరోగా, శ్రావణి హీరోయిన్‌గా నటించారు. ఎస్‌ఎంఎం ఖాజా దర్శకత్వంలో మజ్ను సాహెబ్ మూవీస్, సోహ్రాబ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకాలపై మజ్ను రెహాన్ బేగం నిర్మిస్తున్న ఈ చిత్రం మే 1న రిలీజ్ కానుంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది.
ఇటీవలే టాకీ పార్ట్ పూర్తి చేశాం. రెండు పాటలు మిగిలి ఉన్నాయి. వాటిని త్వరలోనే చిత్రీకరించనున్నాం. ఎస్‌కె మజ్ను అందించిన పాటలకు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు పాడిన ‘ఆటోవాలా...’ సాంగ్ హైలైట్ అయింది. ‘హైటెక్ కిల్లర్’కి సీక్వెల్‌గా ‘హీమాన్’ అనే పేరుతో మరో సినిమా తెరకెక్కిస్తున్నాం. దాన్ని రంజాన్ కానుకగా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: యాదగిరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షేక్ మహ్మద్ , నిర్మాత: మజ్ను రెహాన్ బేగం.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి