బ్రేకింగ్‌ న్యూస్‌లో... | new telugu movie breaking news | Sakshi
Sakshi News home page

బ్రేకింగ్‌ న్యూస్‌లో...

Apr 3 2017 12:05 AM | Updated on Sep 5 2017 7:46 AM

బ్రేకింగ్‌ న్యూస్‌లో...

బ్రేకింగ్‌ న్యూస్‌లో...

‘‘వరుణ్‌లో మంచి నటుడున్నాడు. ‘మనలో ఒకడు’లో దిలీప్‌ పాత్రకు న్యాయం చేశాడు.

‘‘వరుణ్‌లో మంచి నటుడున్నాడు. ‘మనలో ఒకడు’లో దిలీప్‌ పాత్రకు న్యాయం చేశాడు. హీరోగా వరుణ్‌కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌. ఆయన నటించి, దర్శకత్వం వహించిన ‘మనలో ఒకడు’, ఆ తర్వాత ‘లజ్జ’ చిత్రాల్లో కీలక పాత్రలు చేసిన వరుణ్‌ ఆలేటి హీరోగా నటించిన ‘బుడ్డా రెడ్డిపల్లి బ్రేకింగ్‌ న్యూస్‌’ వచ్చే నెలలో విడుదల సిద్ధమవుతోంది.

వరుణ్‌ మాట్లాడుతూ – ‘‘దర్శకుడు నరసింహ నందిగారు ‘..బ్రేకింగ్‌ న్యూస్‌’లో నటనకు ఆస్కారమున్న పాత్రను ఇచ్చారు. విలేజ్‌ లవర్‌బాయ్‌గా కనిపిస్తా. ‘మనలో ఒకడు’లో నాజర్‌ తనయుడిగా నటించడం మర్చిపోలేని అనుభూతి. ప్రస్తుతం ‘ఈనాడు’లో ఓ హీరోగా నటిస్తున్నా. నటుడిగా మంచి పేరొచ్చే పాత్రల్లో నటించాలని నా ఆశ’’ అన్నారు. నటుడు సందేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement