ఏ రకం? | nenorakam teaser! | Sakshi
Sakshi News home page

ఏ రకం?

Apr 17 2016 11:44 PM | Updated on Sep 3 2017 10:08 PM

ఏ రకం?

ఏ రకం?

తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తె రకెక్కిన చిత్రం ‘నేనో రకం’. సాయిరామ్ శంకర్, రేష్మీ మీనన్ జంటగా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న...

తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తె రకెక్కిన చిత్రం ‘నేనో రకం’. సాయిరామ్ శంకర్, రేష్మీ మీనన్ జంటగా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో దీపా శ్రీకాంత్ నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు వంశీ పైడిపల్లి విడుదల చేశారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ- ‘‘సమాజంలో ఉన్న ఒక సమస్య ఇతివృత్తమే ఈ చిత్రం. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని ప్రధానంగా చూపించనున్నాం. సాయిరామ్ శంకర్ లేకుంటే ఈ చిత్రం చేసేవాళ్లం కాదు.

శరత్‌కుమార్ నెగటివ్ రోల్‌లో కనిపిస్తారు. ఈ సినిమా చూసిన రాధికగారు తమిళంలో రిలీజ్ చేసేందుకు ఆసక్తి కనబరిచారు’’ అన్నారు. ‘‘లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. మహిత్ మంచి పాటలిచ్చాడు. మే మొదటి వారంలో పాటలను, చివరి వారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత తెలిపారు. హీరో సాయిరామ్ శంకర్, సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ తదితరులు మాట్లాడారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement