కొత్త రకం... | nenorakam movie release 17th april | Sakshi
Sakshi News home page

కొత్త రకం...

Mar 12 2017 11:31 PM | Updated on Sep 5 2017 5:54 AM

కొత్త రకం...

కొత్త రకం...

సగటు సినీ ప్రేక్షకుల నుంచి విమర్శకుల వరకూ అందరూ మెచ్చే, అందర్నీ ఆలోచింపజేసే సినిమా తీయాలనేది నా లక్ష్యం’’ అన్నారు నిర్మాత శ్రీకాంత్‌ రెడ్డి. రామ్‌శంకర్,

‘‘సగటు సినీ ప్రేక్షకుల నుంచి విమర్శకుల వరకూ అందరూ మెచ్చే, అందర్నీ ఆలోచింపజేసే సినిమా తీయాలనేది నా లక్ష్యం’’ అన్నారు నిర్మాత శ్రీకాంత్‌ రెడ్డి. రామ్‌శంకర్, రేష్మీ మీనన్‌ జంటగా సుదర్శన్‌ శైలేంద్ర దర్శకత్వంలో వంశీధర్‌రెడ్డి సమర్పణలో శ్రీకాంత్‌రెడ్డి నిర్మించిన ‘నేనో రకం’ ఈ నెల 17న రిలీజవుతోంది. శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘దర్శకుడు సుదర్శన్‌ నా స్నేహితుడే. కాంటెంపరరీ ఇష్యూ స్ఫూర్తితో కథ రెడీ చేశాడు. కంటెంట్‌ పరంగా, కమర్షియల్‌గా డెప్త్‌ ఉన్న ఈ కథ విని ఆర్టిస్టులందరూ సింగిల్‌ సిట్టింగ్‌లో ఓకే చెప్పారు. కథ, కథనం హైలెట్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకముంది. అదే విధంగా కమర్షియల్‌ సినిమాల్లో ఇదో కొత్త రకం అనే టాక్‌ వస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement