అతను విలన్‌ కాదు

Neil Nitin Mukesh in Bellamkonda Sai Srinivas Movie - Sakshi

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా వంశధార క్రియేషన్స్‌ పతాకంపై శ్రీనివాస్‌ దర్శకత్వంలో నవీన్‌ శొంటినేనిఓ సినిమా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేష్‌ ఓ కీలక పాత్ర చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘‘నీల్‌ది ఇందులో విలన్‌ పాత్ర కాదు. అతని పాత్ర కథకు కీలకంగా, ప్రేక్షకులకు సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. నెక్ట్స్‌ షెడ్యూల్‌లో నీల్‌ పాల్గొంటారు. ఇందులో నటించనున్న ఇద ్దరు హీరోయిన్ల పేర్లను త్వరలోనే అనౌన్స్‌చేస్తాం’’ అన్నారు నవీన్‌. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌ ఎస్‌.ఎస్‌.

Advertisement
Advertisement
Back to Top