నాని చేతుల మీదుగా ‘నీవెవరో’..! | Neevevaroo Title Poster Revealed By Nani | Sakshi
Sakshi News home page

May 24 2018 1:00 PM | Updated on Aug 13 2018 3:04 PM

Neevevaroo Title Poster Revealed By Nani - Sakshi

విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌ లో మంచి ఫాంలో ఉన్న ఆది పినిశెట్టి హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. నిన్నుకోరి సినిమాలో పాజిటివ్‌ క్యారెక్టర్‌తో ఆకట్టుకున్న ఆది, అదే టీం రూపొందిస్తున్న మరో సినిమాలో హీరోగా ఆకట్టుకోనున్నాడు. రచయిత కోన వెంకట్‌, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా హరినాథ్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమాలో ఆది హీరోగా నటించనున్నాడు.

ఈ టైటిల్‌ లోగోనూ యంగ్‌ హీరో నాని రివీల్‌ చేశాడు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్ననీ సినిమాకు నీవెవరో అనే టైటిల్‌ను నిర్ణయించారు. టైటిల్‌, లోగో చూస్తుంటే ఈ సినిమా కూడా నిన్నుకోరి తరహాలోనే ట్రయాంగిల్‌ లవ్‌స్టోరిగా తెరకెక్కనుందనిపిస్తుంది. మరి ఈ సినిమాతో ఆది సోలో హీరోగానూ సక్సెస్‌ సాధిస్తాడేమో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement