ఆది సినిమాకు మాధవన్‌ సపోర్ట్‌

Neevevaro Song Will Be Launched By Madhavan - Sakshi

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రైం ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ ‘నీవెవరో’. రంగస్థలం తరువాత ఆది ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో టాలీవుడ్ ఈ మూవీపై మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది.  రచయిత కోన వెంకట్‌, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా హరినాథ్‌ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తమిళ సూపర్‌ హిట్‌ అదే కంగల్‌ (అవే కళ్లు) సినిమా ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్సాన్స్‌ వచ్చింది. ఆగస్టు 24న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్. ఈ సినిమాలోని ఓ చెలియా అనే పాటను ప్రముఖ నటుడు మాధవన్‌ చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు. రేపు (సోమవారం) ఉదయం 10 గంటలకు ఈ పాటను రిలీజ్ చేయనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top