నయనతార స్పెషల్ సాంగ్‌తో... | Nayanthara and Dhanush's item song for Ethir Neechal | Sakshi
Sakshi News home page

నయనతార స్పెషల్ సాంగ్‌తో...

Mar 9 2014 12:16 AM | Updated on Sep 2 2017 4:29 AM

నయనతార స్పెషల్ సాంగ్‌తో...

నయనతార స్పెషల్ సాంగ్‌తో...

సినిమాల్లోని ప్రత్యేకగీతాల్లో హీరోయిన్లు నర్తించడం సర్వసాధారణం. కానీ.. ఓ స్టార్‌హీరో, ఓ స్టార్‌హీరోయిన్ కలిసి సంబంధంలేని సినిమాలో ప్రత్యేకగీతంలో చేయడం నిజంగా విశేషమే.

సినిమాల్లోని ప్రత్యేకగీతాల్లో హీరోయిన్లు నర్తించడం సర్వసాధారణం. కానీ.. ఓ స్టార్‌హీరో, ఓ స్టార్‌హీరోయిన్ కలిసి సంబంధంలేని సినిమాలో ప్రత్యేకగీతంలో చేయడం నిజంగా విశేషమే. అప్పుడెప్పుడో వెంకటేశ్, శ్రీయ కలిసి తరుణ్ ‘సోగ్గాడు’ చిత్రంలో ఓ పాట చేశారు. తర్వాత మళ్లీ ఆ దాఖలాలు కనిపించలేదు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ ఫీట్ రిపీట్ అయ్యింది. అయితే... ఈసారి అడుగు కదిపిన నాయకా నాయికలు ఎవరనుకుంటున్నారు? ధనుష్, నయనతార. ఇంతకీ వీరిద్దరూ కలిసి నర్తించిన సినిమా ఏదంటే... శివకార్తికేయన్, ప్రియా ఆనంద్ జంటగా ఆర్.ఎస్.దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘ఎదిర్ నీచెల్’. 
 
 దనుష్ ఈ చిత్రానికి నిర్మాత కావడం విశేషం. ధనుష్ మాట కాదనలేకే... ఈ సినిమాలో నయనతార తనతో పాటు ప్రత్యేకగీతంలో నర్తించారు. అదీ విషయం. ఈ చిత్రం ‘నా లవ్‌స్టోరి మొదలైంది’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. రామాంజనేయులు.జె ఈ అనువాద చిత్రానికి నిర్మాత. యువతరం ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘తెలుగు నేటివిటీకి దగ్గరగా సాగే ప్రేమకథ ఇది. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. కొన్ని సన్నివేశాలైతే... మనసుకు హత్తుకుంటాయి. అనిరుధ్ సంగీతం, నయనతార స్పెషల్‌సాంగ్ అదనపు ఆకర్షణలు. ఈ నెలలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement