షాకిచ్చిన నయనతార! | nayanatara gives shock to sanghamithra team | Sakshi
Sakshi News home page

షాకిచ్చిన నయనతార!

Jul 11 2017 8:09 PM | Updated on Sep 5 2017 3:47 PM

షాకిచ్చిన నయనతార!

షాకిచ్చిన నయనతార!

తేనాండాల్‌ ఫిలింస్‌ నిర్మాణంలో రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం సంఘమిత్ర. ఇందులో జయం రవి, ఆర్య హీరోలుగా నటిస్తునండగా సంఘమిత్ర అనే టైటిల్‌ రోల్‌ను శృతిహాసన్‌ నటించాల్సి ఉంది.

చెన్నై: తేనాండాల్‌ ఫిలింస్‌ నిర్మాణంలో రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం సంఘమిత్ర. ఇందులో జయం రవి, ఆర్య హీరోలుగా నటిస్తునండగా సంఘమిత్ర అనే టైటిల్‌ రోల్‌ను శృతిహాసన్‌ నటించాల్సి ఉంది. అందుకోసం ఆమెకు కత్తిసామువంటి కళల్లో శిక్షణలు కూడా ఇప్పించారు. అయితే, చిత్ర షూటింగ్‌ ప్రారంభం కాబోయే సమయంలో పరిస్థితుల్లో ఆ చిత్రం నుంచి శృతి పక్కకు తప్పుకున్నట్టు వెల్లడించారు. దీంతో ఆ పాత్ర కోసం తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషా నటి కోసం గాలించాల్సిన పరిస్థితి సంఘమిత్ర బృందానికి ఏర్పడింది.

అప్పుడే దక్షిణాదిలో అగ్ర తారలుగా వెలుగుతున్న నయనతార, అనుష్కలతో రెండేళ్లకు కాల్‌ షీట్లకు బేరసారాలు జరిపారు. ఇద్దరూ ఇప్పటికే కొన్ని చిత్రాలలో కమిట్‌ అయి నటిస్తుండడం వలన ఇప్పటికి సంఘమిత్రలో నటించడం కుదరదని తెలిపారట. అయినప్పటి నయనతార నటిస్తే బాగుంటుందని తలచిన చిత్ర బృందం ఆమెతో పలుమార్లు చర్చలు జరుపుతూ వచ్చారు. సంఘమిత్ర తో కమిట్‌ అయితే కనీసం ఒకటిన్నర సంవత్సరం వేరే చిత్రాలలో నటించడానికి కుదరదు. దీంతో జాగ్రత్తగా ఆలోచించిన నయన్‌ తాను సంఘమిత్రలో నటించడానికి సిద్ధమేనని తెలిపిందట. అయితే అందుకు ఆమె డిమాండ్‌ చేసిన రెమ్యూనరేషన్‌ మొత్తం విని బెంబేలెత్తిన చిత్ర బృందం ఆ తర్వాత నుంచి ఆమెతో చర్చలు జరపడం నిలిపేసినట్లు కోలీవుడ్‌ టాక్‌.

Advertisement
 
Advertisement
Advertisement