ప్రియుడికి ప్రేమతో హీరోయిన్‌ భారీ గిఫ్ట్‌ | nayanatara given BMW to her boyfriend | Sakshi
Sakshi News home page

ప్రియుడికి ప్రేమతో హీరోయిన్‌ భారీ గిఫ్ట్‌

Jul 27 2017 7:53 PM | Updated on Sep 5 2017 5:01 PM

ప్రియుడికి ప్రేమతో హీరోయిన్‌ భారీ గిఫ్ట్‌

ప్రియుడికి ప్రేమతో హీరోయిన్‌ భారీ గిఫ్ట్‌

ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం అన్నది పాత పాట. ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత మురిపం అన్నది నేటి మాట అనాలనిపిస్తోంది నటి నయనతారను చూస్తుంటే.

చెన్నై: ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం అన్నది పాత పాట. ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత మురిపం అన్నది నేటి మాట అనాలనిపిస్తోంది నటి నయనతారను చూస్తుంటే. నయనతార.. ఇప్పుడు ఈ ఒక్క పేరు చాలు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్డడానికి. కొందరు స్టార్‌ నటుల మాదిరి జయాపజయాలకు అతీతంగా మారిపోయింది నయనతార మార్కెట్‌. ప్రేమకు, పాటలకు పరిమితమైన పాత్రలను అధిగమించి కథానాయకి పాత్రలకు ప్రాముఖ్యత కలిగిన కథా చిత్రాల్లో నటించే స్థాయికి ఎదిగిన టాప్‌ హీరోయిన్‌ నయనతార.

ఈమె నటించిన హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రం ‘మాయ’ అనూహ్య విజయాన్ని సాధించింది. అయితే ఆ తరువాత నటించిన ‘డోరా’ నిరాశపరిచింది. అయినా ఈ స్టార్‌ నటి మార్కెట్‌ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం అదే తరహా చిత్రాలు అరమ్, ఇమైకా నోడిగళ్, కొలైయుదీర్‌ కాలం, నేర్‌వళి చిత్రాలతో పాటు తాజాగా అంగీకరించిన ‘ఖోఖో’ అంటూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అదే విధంగా శివకార్తీకేయన్‌కు జంటగా నటించిన వేలైక్కారన్‌ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. కాగా, నయనతార వ్యక్తిగత జీవితంలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు.

ముఖ్యంగా ప్రేమలో రెండుసార్లు విఫలమైన ఆమె ముచ్చటగా మూడోసారి ప్రేమలో మునిగి తేలుతున్నట్లు ప్రచారం చాలాకాలంగా జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు విఘ్నేశ్‌శివతో నయనతార ప్రేమ ఆయనతో సహజీవనం సాగించే స్థాయికి తీసుకెళ్లిందంటున్నారు. ఈ విషయం గురించి ఇద్దరూ మౌనం వహిస్తున్నా, వీరి మధ్య ప్రేమ కొనసాగుతోందనడానికి చాలా కారణాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ తన ప్రియుడికి అతి ఖరీదైన బీఎండబ్ల్యూ కారును గిఫ్ట్‌గా కొనిచ్చారట. ఇప్పుడీ విషయమే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నయనా మజాకా!

Advertisement
 
Advertisement
Advertisement