ఆయన సోదరుడు షమాస్‌ కూడా కారణం: అలియా

Nawazuddin Siddiqui Wife Aaliya Opened About Her Divorce With Him - Sakshi

ముంబై: బాలీవుడ్‌ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీతో విడిపోవడనికి గల కారణాలను ఆయన భార్య అలియా సిద్దిఖీ వెల్లడించారు. నవాజుద్దీన్‌తో విడాకుల విషయంపై ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ... తను విడాకులు తీసుకోవడానికి ఆయన సోదరుడు షామాస్‌ కూడా కారణమని పేర్కొన్నారు. “నేను ఇప్పటికీ చాలా విషయాలు బహీర్గతం చేయాలనుకోవడం లేదు. అయితే ఆయనతో విడిపోవాలనీ మాత్రం కోరుకుంటున్న. నవాజు, నేను దశాబ్దం క్రితం పెళ్లి చేసుకున్నాం.  మా వివాహం అయిన ఎడాది నుంచే మా వైవాహిక బంధంలో సమస్యలు వచ్చాయి. అంతేగాక ఈ రెండు నెలల లాక్‌డౌన్‌లో తనతో విడిపోవాలా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవడానికి నాకు చాలా సమయం దొరికింది. వివాహంలో ఆత్మగౌరవం చాలా ముఖ్యం. కానీ అది నా ఉనికిలో లేకుండా పోయింది. ఎప్పుడూ నేను ఒంటరినని, నాకు ఎవరూ లేరనే భావనతోనే ఉన్నాను. మా సమస్యలకు నవాజు సోదరుడు షమాస్ కూడా ఒక కారణం’ అని చెప్పుకొచ్చారు. (నటుడికి షాకిచ్చిన భార్య.. లీగల్‌ నోటీసులు)

అంతేగాక “ఆయనతో విడిపోవడానికి ఒక్క సమస్యే కారణం కాదు.. ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ కారణాలన్నీ కూడా  భరించలేనివి. మా పెళ్లైనా ఎడాది నుంచే మా మధ్య సమస్యలు మొదలయ్యాయి కానీ ఇంతకాలం వాటిని భరించాను. ఇక అవి భరించిలేనంత తీవ్రమయ్యాయి. అందుకే ఆయనతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నా. అంతేకాదు ఇక నేను నా అసలు పేరు అంజనా కిషోర్‌ పాండేను తిరిగి పొందాలనుకుంటున్న. ఎందుకంటే ఇక నుంచి నవాజు భార్యగా గుర్తింపును పొందాలనుకోవడం లేదు. మా వివాహం అనంతరం ఆయన గుర్తింపును కానీ, జ్ఞాపకాలను కానీ నా వెంట ఉంచుకోవాలనుకోవడం లేదు. నా నిర్ణయం ప్రకారమే విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను. ఇకపై ఈ బంధాన్ని కొనసాగించాలనుకోవడం లేదు. భవిష్యత్తును గురించిన ఆలోచన కూడా లేదు. నా నిర్ణయాన్ని మార్చుకునే ఉద్దేశమే లేదు. ఇక పిల్లలను నేనే పెంచాను వారి బాధ్యత కూడా నాదే’’ అని ఆమె స్పష్టం చేశారు. (రెండు వారాల పాటు క్వారంటైన్‌లో నటుడు)

కాగా నవాజు నుంచి విడిపోవాలని కోరుకుంటు అలియా నోటీసులు ఇచ్చినట్లు ఆమె తరపు న్యాయవాది మంగళవారం వెల్లడించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ-మెయిల్‌, వాట్సాప్‌ల ద్వారా ఆమె మే 7న నోటీసులు పంపినట్లు అలియా లాయర్‌ అభయ్‌ తెలిపారు. విడిపోయిన అనంతరం అలియాకు చెల్లించాల్సిన భరణం గురించి కూడా ఇందులో ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. నవాజుద్దీన్‌, ఆయన కుటుంబంపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని... లీగల్‌ నోటీసులకు నవాజుద్దీన్‌ ఇంతవరకు స్పందించ లేదని ఆయన తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top