మళ్లీ మళ్లీ రాని అవకాశం

Naresh is Raghupathi Venkaiah Naidu Release On November - Sakshi

తెలుగు చలనచిత్ర పితామహునిగా పిలుచుకునే రఘుపతి వెంకయ్యనాయుడు జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘రఘుపతి వెంకయ్యనాయుడు’. టైటిల్‌ పాత్రలో సీనియర్‌ నటుడు వీకే నరేష్‌ నటించారు. ఎల్లో లైన్‌ పిక్చర్స్‌ పతాకంపై మండవ సతీష్‌ బాబు నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయాలనుకుంటున్నారు.

ఈ సందర్భంగా నరేష్‌ మాట్లాడుతూ– ‘‘రఘుపతి వెంకయ్యనాయుడిగారి పాత్రలో నటించడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం ఇది. తెలుగు సినిమా బతికి ఉన్నంతవరకు ఈ సినిమా అందరికీ గుర్తుండిపోతుంది’’ అన్నారు. ‘‘రఘుపతి వెంకయ్యగారు చేసిన కృషిని గుర్తు చేయడానికి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ సినిమా కోసం చాలా పరిశోధన చేశాం’’ అన్నారు బాబ్జీ. తనికెళ్ల భరణి, మహర్షి, వాహిని, సత్యప్రియ, భావన తదితరులు నటించిన ఈ సినిమాకు శ్రీ వెంకట్‌ సంగీతం అందించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top