అవసరాల డైరెక్షన్లో నాని | Nani to team up with Avasarala Srinivas | Sakshi
Sakshi News home page

అవసరాల డైరెక్షన్లో నాని

Sep 3 2016 11:02 AM | Updated on Sep 4 2017 12:09 PM

అవసరాల డైరెక్షన్లో నాని

అవసరాల డైరెక్షన్లో నాని

అష్టాచమ్మ సినిమాతో యంగ్ హీరో నాని, నటుడు కం దర్శకుడు అవసరాల శ్రీనివాస్ల కెరీర్ ఒకేసారి మొదలైంది. ఈ సినిమా తరువాత నాని హీరోగా సెటిల్ అవ్వగా, అవసరాల శ్రీనివాస్ మాత్రం కామెడీ పాత్రలు...

అష్టాచమ్మ సినిమాతో యంగ్ హీరో నాని, నటుడు కం దర్శకుడు అవసరాల శ్రీనివాస్ల కెరీర్ ఒకేసారి మొదలైంది. ఈ సినిమా తరువాత నాని హీరోగా సెటిల్ అవ్వగా, అవసరాల శ్రీనివాస్ మాత్రం కామెడీ పాత్రలు చేస్తూనే దర్శకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు పూర్తి చేసిన అవసరాల దర్శకుడిగా మరిన్ని సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ప్రస్తుతం తన దర్శకత్వంలో రూపొందిన జ్యో అచ్యుతానంద సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న అవసరాల శ్రీనివాస్.. ఆ తరువాత నాని హీరోగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. వరుస సక్సెస్లతో నాచురల్ స్టార్గా ఎదిగిన నాని కూడా అవసరాలతో కలిసి పనిచేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైన సినిమాలు చేసే ఈ ఇద్దరి కాంబినేషన్పై ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement