ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు? | Nani to launch Ami Tumi teaser | Sakshi
Sakshi News home page

ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు?

Apr 19 2017 12:23 AM | Updated on Sep 5 2017 9:05 AM

ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు?

ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు?

ఓ అబ్బాయికి రెండు పెళ్లి సంబంధాలు వచ్చాయి. ఆల్రెడీ ఓ అమ్మాయి ప్రేమలో పడితే... మరో అమ్మాయి ప్రేమకు దూరంగా ప్రశాంతంగా బతకాలనుకుంటుంది.

ఓ అబ్బాయికి రెండు పెళ్లి సంబంధాలు వచ్చాయి. ఆల్రెడీ ఓ అమ్మాయి ప్రేమలో పడితే... మరో అమ్మాయి ప్రేమకు దూరంగా ప్రశాంతంగా బతకాలనుకుంటుంది. మరి వేరొకరితో పెళ్లంటే... ఈ అమ్మాయిలను ప్రేమించినోళ్లు అంత ఈజీగా వదలరు కదా! ఇక్కడా అదే జరిగింది. అప్పుడా అబ్బాయి ఎవర్ని పెళ్లి చేసుకున్నాడనే కథతో రూపొందుతోన్న సినిమా ‘అమీ తుమీ’. అవసరాల శ్రీనివాస్, అడివి శేష్‌ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఏ గ్రీన్‌ ట్రీ ప్రొడక్షన్స్‌ పతాకంపై కేసీ నరసింహారావు నిర్మిస్తున్నారు.

 సోమవారం దర్శకుడు ఇంద్రగంటి బర్త్‌డే సందర్భంగా ‘అమీ తుమీ’ టీజర్‌ను హీరో నాని విడుదల చేశారు. ‘‘టీజర్‌కి మంచి స్పందన లభిస్తోంది. నిర్మాణానంతర కార్యక్రమాలు చివరిదశకు చేరుకున్నాయి. మే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత. ఈషా, అదితీ మ్యాకల్‌ హీరోయిన్లుగా, ‘వెన్నెల’ కిశోర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వినయ్, సంగీతం: మణిశర్మ .

Advertisement
 
Advertisement
Advertisement