బిగ్‌బాస్‌-2.. హోస్ట్‌ దొరికాడు

Nani May Host For Bigg Boss Show 2 Season - Sakshi

సాక్షి, సినిమా : బుల్లితెర షో బిగ్‌ బాస్‌ మొదటి షో సక్సెస్‌ కావటంతో 2 సీజన్‌ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ దఫా సీజన్‌కు హోస్ట్‌ ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఆ మధ్య మరికొందరు స్టార్ల పేర్లు తెరపైకి రాగా.. తాజాగా ఎన్టీఆర్‌ ఈ షో నుంచి దాదాపు అవుట్‌ అన్నది కన్ఫర్మ్‌ చేస్తూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

అందుకు కారణం త్రివిక్రమ్‌ సినిమా త్వరలో మొదలు కావటమే. దీంతో నిర్వాహకులకు ఎన్టీఆర్‌ సారీ చెప్పేశాడని.. నేచురల్‌ స్టార్‌ నానిని  సదరు ఛానెల్‌ సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. కృష్టార్జున యుద్ధం తర్వాత నాని నాగ్‌తో మల్టీస్టారర్‌ చేస్తున్నాడు. ఈ షూటింగ్‌ లో కాస్త గ్యాప్‌ దొరికే అవకాశం ఉండటంతో షో నిర్వహణకు వీలుంటుందని నాని కూడా భావిస్తున్నాడంట.

దీంతో సెకండ్‌ సీజన్‌కు నాని దాదాపు ఖరారు అయినట్లేనని ఆ కథనాల సారాంశం. అయితే ఈ వార్తపై ఛానెల్‌ నుంచిగానీ, నాని తరపు నుంచి గానీ అధికారిక ప్రకటన వెలువడలేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top