హిట్ కాంబినేషన్ మరోసారి..! | Nani Hit combo to repeat again | Sakshi
Sakshi News home page

హిట్ కాంబినేషన్ మరోసారి..!

Feb 23 2017 3:44 PM | Updated on Sep 5 2017 4:26 AM

హిట్ కాంబినేషన్ మరోసారి..!

హిట్ కాంబినేషన్ మరోసారి..!

డబుల్ హ్యాట్రిక్ సక్సెస్లతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని అదే జోరు కంటిన్యూ చేసేందుకు ట్రై

డబుల్ హ్యాట్రిక్ సక్సెస్లతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని అదే జోరు కంటిన్యూ చేసేందుకు ట్రై చేస్తున్నాడు. సక్సెస్ ఫుల్ కాంబినేషన్లను సెట్ చేస్తూ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. నేను లోకల్ సినిమాకు ముందే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభించిన నాని.. ఇప్పుడు మరిన్ని ప్రాజెక్ట్లను లైన్లో పెడుతున్నాడు. వీటి కోసం క్రేజీ కాంబినేషన్ లను సెట్ చేసే పనిలో ఉన్నాడు.

ఇటీవల నాని హీరోగా కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో భారీ హిట్ అందుకున్న దర్శకుడు, హను రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు నిర్ణయించుకున్నాడు నాని. ప్రస్తుతం నితిన్ హీరోగా సినిమాను తెరకెక్కిస్తున్న హను.. ఆ తరువాత నాని హీరోగా తెరకెక్కబోయే సినిమా పనులు ప్రారంభించనున్నాడు. గతంలో అష్టాచమ్మా సినిమాతో తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో జెంటిల్మన్ సినిమా చేసి మంచి విజయం అందుకున్నాడు. అదే మ్యాజిక్ను హను రాఘవపూడితోను రిపీట్ చేసే ప్లాన్లో ఉన్నా నేచ్యురల్ స్టార్.

Advertisement
 
Advertisement
Advertisement