ఫస్ట్‌లుక్‌ : అచ్చం ఎన్టీఆర్‌లాగే

Nandamuri Balakrishna First Look In NTR Movie - Sakshi

క్రిష్‌ దర్శకత్వంలో నందమూరి తారకరామారావు బయోపిక్‌ ‘ఎన్టీఆర్‌’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. టైటిల్‌ రోల్‌ పోషిస్తూ, బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదల చేసిన బాలయ్య ఫస్ట్‌లుక్‌ అంచనాలను మరింతగా పెంచేసింది. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ అభిమాలను ఆకట్టుకుంటోంది. కాషాయ వస్త్రాల్లో మైక్‌ ముందు నిలబడి.. ఎన్టీఆర్‌ సిగ్నేచర్‌ మార్కుతో ఉన్న బాలయ్యను చూస్తే అచ్చం ఎన్టీఆర్‌ను చూసినట్టే ఉందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ఈ సినిమాలో ఆయన భార్యగా విద్యాబాలన్‌ నటిస్తున్నారు. సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ, యువ నటులు రానా, సుమంత్‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమా తొలి షెడ్యూల్‌ ఇటీవలే పూర్తయింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top