ఎన్టీఆర్‌లో ఎస్వీఆర్‌గా..!

Nagababu As Sv Rangarao In NTR Biopic - Sakshi

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్‌ బయోపిక్‌ రూపొందుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య స‍్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక ఇప్పటికీ కొనసాగుతోంది. లెజెండరీ నటుల పాత్రలో కనిపించే నటీనటుల కోసం చిత్రయూనిట్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే అక్కినేని నాగేశ్వర రావు పాత్రకు సుమంత్‌ను తీసుకున్న యూనిట్‌, తాజాగా ఎస్వీ రంగారావు పాత్రను ఫైనల్‌ చేసినట్టుగా తెలుస్తోంది. ముందుగా ఈ పాత్రకు మహానటిలో ఎస్వీఆర్‌గా నటించిన మోహన్‌బాబును తీసుకోవాలని భావించారు. కానీ తాజాగా ఆ పాత్రకు మెగా బ్రదర్‌ నాగబాబును ఫైనల్‌ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్‌లో నాగబాబు నటించడంపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top