‘సవ్యసాచి’ చివరి షెడ్యుల్‌ 

Naga Chaitanya Savyasachi Last Scheduled Shooting - Sakshi

‘రారండోయ్‌ వేడుకచూద్దాం’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు నాగచైతన్య. ప్రస్తుతం ఈ హీరో సవ్యసాచి, శైలజా రెడ్డి అల్లుడు షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ఇవే కాకుండా శివ నిర్వాణ డైరెక్షన్‌లో ఓ ప్రేమకథను కూడా అంగీకరించాడు. ఈ మూవీలో సమంత హీరోయిన్‌గా నటించనున్నారు. 

శైలజా రెడ్డి అల్లుడు ఆగస్ట్‌ 31న విడుదల కానుంది. మారుతి డైరెక్షన్‌లో రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో నటించగా.. చైతన్యకు జోడిగా అను ఇమ్మాన్యుయెల్‌ నటిస్తున్నారు. మరోపక్క చందూ మొండేటీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సవ్యసాచి.. ప్రస్తుతం చివరి షెడ్యుల్‌ జరుపుకుంటోందని సమాచారం. త్వరలోనే విడుదల తేదిని ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ మూవీలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top