భారీ టన్నల్‌లో బన్నీ ఫైట్స్‌ | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 28 2018 11:43 AM

Naa Peru Surya Action Sequence Update - Sakshi

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బన్నీ  ఆవేశపరుడైన ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అందుకు తగ్గట్టుగా సినిమాలో భారీ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. తాజాగా ఈ సినిమాలో కీలకమైన ఓ పోరాట సన్నివేశానికి సంబంధించిన అప్‌ డేట్‌ టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్‌ చల్‌ చేస్తోంది.

విరామం సమయంలో వచ్చే ఈ సినిమా సన్నివేశం హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడ దగ్గర ఓ భారీ టన్నల్ సెట్‌ను నిర్మించారట. ఈ ఫైట్‌ సీన్‌ సినిమాకే హైలట్‌గా నిలుస్తుందంటున్నారు చిత్రయూనిట్‌. బన్నీ సరసన అను ఇమ్మాన్యూల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమాను లగడపాటి శ్రీధర్‌, నాగబాబులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్‌ శేఖర్‌లు స్వరాలందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement