ఆర్‌ఆర్‌ఆర్‌లో..? | MOohan lal Act In RRRMovie | Sakshi
Sakshi News home page

ఆర్‌ఆర్‌ఆర్‌లో..?

Apr 10 2020 3:34 AM | Updated on Apr 10 2020 3:34 AM

MOohan lal Act In RRRMovie - Sakshi

‘రౌద్రం రణం రుధిరం’(ఆర్‌ఆర్‌ఆర్‌) చిత్రంలో మోహన్‌లాల్‌ ఓ కీలక పాత్రలో నటించబోతున్నారా? అంటే ఫిల్మ్‌ నగర్‌ వర్గాలు అవునంటున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’(ఆర్‌ఆర్‌ఆర్‌). 1920 నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్‌ పడింది. తాజాగా ఈ సినిమాలో మోహన్‌లాల్‌ ఓ కీలక పాత్ర చేయనున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్‌ పాత్రకు బాబాయ్‌గా మోహన్‌లాల్‌ కనిపిస్తారట. ఇది వరకు ఎన్టీఆర్, మోహన్‌లాల్‌ కలిసి ‘జనతా గ్యారేజ్‌’ (2016) చిత్రంలో నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement