చారిత్రక కథతోనే మోక్షజ్ఞ ఎంట్రీ..? | Mokshagna Debut with Historical Movie | Sakshi
Sakshi News home page

చారిత్రక కథతోనే మోక్షజ్ఞ ఎంట్రీ..?

Jan 19 2017 10:59 AM | Updated on Sep 5 2017 1:37 AM

చారిత్రక కథతోనే మోక్షజ్ఞ ఎంట్రీ..?

చారిత్రక కథతోనే మోక్షజ్ఞ ఎంట్రీ..?

గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో ఘనవిజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ, తన వారసుడి ఎంట్రీకి కూడా అదే తరహా కథ అయితే కరెక్ట్ అని భావిస్తున్నాడట

గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో ఘనవిజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ, తన వారసుడి ఎంట్రీకి కూడా అదే తరహా కథ అయితే కరెక్ట్ అని భావిస్తున్నాడట. అందుకే చారిత్రక కథాంశంతోనే మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. తనకు అద్భుత విజయాన్ని అందించిన క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చారిత్రక చిత్రంతో మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం అయ్యే అవకాశం ఉంది.

గౌతమిపుత్ర శాతకర్ణి తరువాత వెంకటేష్ హీరోగా థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించనున్నాడు క్రిష్. ఆ సినిమా తరువాత మరోసారి బాలీవుడ్లో అక్షయ్ కుమార్ హీరోగా ఓ సినిమా చేసేందుకు అంగకీరించాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత గౌతమిపుత్ర శాతకర్ణికి సీక్వల్గా శాతకర్ణి కుమారుడు వాశిష్టిపుత్ర పులుమావి కథతో మరో భారీ చారిత్రక చిత్రాన్ని రూపొందించే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాతోనే మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement