breaking news
Historical Movie
-
వెండితెరపై హిస్టరీ రిపీట్!
వెండితెరపై హిస్టరీ రిపీట్ అవుతోంది. అవును... వందల సంవత్సరాల క్రితం జరిగిన కొన్ని చారిత్రక సంఘటనలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. ఇందుకోసం స్టార్ హీరోలు రంగంలోకి దిగారు. భారీ బడ్జెట్లతో నిర్మాతలు, సూపర్ టేకింగ్‌తో దర్శకులు తీస్తున్న ఆ సినిమాల వివరాలు, ఆ చారిత్రక సంఘటనల విశేషాలను తెలుసుకుందాం.మాస్ కాదు... ఫ్యాంటసీ ‘వీరసింహారెడ్డి’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో సినిమా రానుంది. అయితే ఈ సారి ఓ చారిత్రక కథను సిద్ధం చేశారు గోపీచంద్ మలినేని. బాలకృష్ణ హీరోగా నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా తరహాలో ఈ సినిమా కూడా ఉంటుందని, ఈ హిస్టారికల్ డ్రామాలో మరో హీరోకి కూడా స్కోప్ ఉందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాలో రెండో హీరోగా వెంకటేశ్ నటిస్తారని తెలిసింది. అలాగే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా తర్వాత హీరో బాలకృష్ణ–దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో మరో సినిమా రానుందని, ఇది హిస్టారికల్ డ్రామా అనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.తండ్రీకొడుకుల ఎమోషన్ ‘ఎల్2: ఎంపురాన్, తుడరుమ్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల సక్సెస్‌తో ఈ ఏడాది మంచి జోరు మీద ఉన్నారు మలయాళ హీరో మోహన్‌లాల్. అలాగే మోహన్‌లాల్ నటించిన మరో రెండు సినిమాలు ‘వృషభ, హృదయపూర్వం’ విడుదలకు సిద్ధం అవుతున్నాయి. కాగా ‘వృషభ’ సినిమా హిస్టారికల్ మూవీ అని ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. తండ్రీకొడుకుల ఎమోషన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబరు 16న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమాకు నందకిశోర్ దర్శకత్వం వహించారు. శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, సీకే పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్. వ్యాస్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా ఈ సినిమాను నిర్మించారు.సైనికుడి పోరాటం బ్రిటిష్ పరిపాలన కాలంలో ఓ సైనికుడి వీరోచిత పోరాటం, త్యాగం, ప్రేమ... వంటి అంశాలతో ఓ హిస్టారికల్ డ్రామా సినిమా రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తారు. హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడిపాత్రలో నటిస్తున్నారని, 1940 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది.భాగ్యనగరం, నైజాంలో రజాకార్ల ఆకృత్యాలు వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందట. ఈ చిత్రం షూటింగ్ సగానికిపైగా పూర్తయిందని తెలిసింది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు.బెంగాల్లో డ్రాగన్ హీరో ఎన్టీఆర్–దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘డ్రాగన్’ (పరిశీలనలో ఉన్న టైటిల్) సినిమా రానుంది. ఇది హిస్టారికల్ డ్రామా మూవీ అని తెలిసింది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ప్రధానంగా ఈ సినిమాలో బెంగాల్, బంగ్లాదేశ్‌ల నేపథ్యం కనిపిస్తుందట. 1850 టైమ్‌లైన్‌లో ఈ సినిమా మేజర్ కథనం ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమా కాన్సెప్ట్ అనౌన్స్మెంట్ పోస్టర్ ఈ విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేస్తోంది.అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో రుక్ముణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారని, విలన్‌గా మలయాళ నటుడు టోవినో థామస్ కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై కల్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాను 2026 జనవరి 9న విడుదల చేయాలనుకున్నారు. కానీ... ఆ తర్వాత 2026 జూన్ 25కు విడుదలను వాయిదా చేశారు. ఈ సినిమాకు రవిబస్రూర్ సంగీతం అందిస్తున్నారు.రాయలసీమ నేపథ్యంలో... రాయలసీమలో జరిగిన కొన్ని చారిత్రక సంఘటనలతో హీరో విజయ్ దేవరకొండ ఓ హిస్టారికల్ సినిమా చేస్తున్నారు. 2018లో విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ రూపంలో ఓ హిట్ అందించిన రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకుడు. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. కొద్ది రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ కోసం ఓ భారీ సెట్‌ను రెడీ చేస్తున్నారు మేకర్స్.1854–1878 మధ్య కాలంలో రాయలసీమలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా, ఇప్పటివరకు ఎవరూ వెండితెరపై చెప్పని ఓ సరికొత్తపాయింట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ తెలిపారు. విజయ్ దేవరకొండ సరసన రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే... ‘గీతగోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా ముచ్చటగా మూడోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నట్లవుతుంది. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, భూషణ్‌కుమార్, క్రిషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.రాజుల కథ హీరో నిఖిల్ రెండు హిస్టారికల్ సినిమాలు చేస్తున్నారు. అందులో మొదటిది ‘స్వయంభూ’. ‘బాహుబలి’ తరహా మాదిరి రాజుల కాలం నాటి కల్పిత కథతో ‘స్వయంభూ’ సినిమా కథనం ఉంటుంది. సంయుక్త, నభా నటేశ్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రారంభం కానుందని తెలిసింది. ఠాగూర్ మధు సమర్పణలో ఈ భారీ బడ్జెట్ సినిమాను భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత రానుంది. అలాగే నిఖిల్ హీరోగా చేస్తున్న మరో సినిమా ‘ది ఇండియా హౌస్’. 1905 నేపథ్యంలో కొన్ని వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా రామ్ వంశీకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల సెట్స్‌లో జరిగిన ఓ చిన్న ప్రమాదం కారణంగా ఈ సినిమా చిత్రీకరణ తాత్కాలికంగా వాయిదా పడింది.రామ్‌చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి. మెగా పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్న ‘ది ఇండియా హౌస్’ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా 2026 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. 1905లో లండన్‌లో జరిగిన కొన్ని సంఘటనలు భారతదేశ స్వాతంత్య్రంపై ఏ విధంగా ప్రభావితం చూపాయి అనే కోణంలో ఈ సినిమా కథనం సాగుతుందట. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సవార్కర్‌కు చెందిన సంఘటనలు కూడా ఈ సినిమాలో హైలైట్‌గా ఉంటాయట.గోపీచంద్ శూల ప్రేక్షకులను ఏడో శతాబ్దంలోకి తీసుకుని వెళ్లనున్నారు గోపీచంద్. ‘ఘాజీ, అంతరిక్షం’ వంటి సినిమాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో ఓ హిస్టారికల్ వార్ డ్రామా చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో గోపీచంద్ వారియర్‌గా నటిస్తున్నారు. కశ్మీర్లో ఓ లాంగ్ షూటింగ్ షెడ్యూల్‌ను ఆ మధ్య పూర్తి చేశారు. ఈ సినిమా ఏడో శతాబ్దం నేపథ్యంలో సాగుతుందని, ఇప్పటివరకు చరిత్రలో ఎవరూ టచ్ చేయని ఓపాయింట్తో తాము ఈ సినిమా చేస్తున్నామని చిత్రయూనిట్ పేర్కొంది. గోపీచంద్ కెరీర్‌లోని ఈ హిస్టారికల్ సినిమాను భారీ బడ్జెట్‌తో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకు ‘శూల’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా 2026 ద్వితీయార్ధంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇలా హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి.శతాబ్దాల క్రితంనాటి కథలు కాదు... కానీ సెమీ పీరియాడికల్ సినిమాలు (50–60 సంవత్సరాల క్రితం నేపథ్యంలో) మరికొన్ని ఉన్నాయి. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’, ‘దసరా’ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లోని ‘దిప్యారడైజ్’, దుల్కర్ సల్మాన్ ‘కాంత’, ఆది సాయికుమార్ ‘శంబాల’, రోషన్ మేకా ‘చాంపియన్’... ఈ కోవకి చెందిన సినిమాలే. కాంతార ప్రీక్వెల్ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా మూడు హిస్టారికల్ సినిమాల్లో రిషబ్ శెట్టి నటించడం విశేషం. అది కూడా ఈ సినిమాల వరుసగా చేయడం అంటే చిన్న విషయం కాదు. పీరియాడికల్ కథలపై కన్నడ నటుడు–దర్శక–హీరో రిషబ్ శెట్టి ఎక్కువ మక్కువ చూపిస్తున్నట్లుగా ఉన్నారు. రిషబ్ వరుసగా శతాబ్దాల క్రితం నాటి కథలతో సినిమాలు చేస్తున్నారు. రిషబ్ శెట్టి హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా ‘కాంతార: చాఫ్టర్ 1’. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’ సినిమాకు ఇది ప్రీక్వెల్‌గా రానుంది.‘కాంతార’ సినిమా కథ 1847లో మొదలై 1970లో జరిగే కొన్ని సన్నివేశాలతో కొనసాగుతుంది. అయితే ప్రధానంగా 1990 బ్యాక్‌డ్రాప్‌లో మేజర్ సినిమా కథనం సాగుతుంది. ‘కాంతార’ సినిమా కథ 1847లో మొదలైంది కనుక ‘కాంతార’ ప్రీక్వెల్ ఇంకా ముందు జరిగిన కథగా ఉంటుంది. ఈ ప్రకారం ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా కనీసం రెండు వందల సంవత్సరాల క్రితం జరిగిన కథగా ప్రేక్షకుల ముందుకు రావొచ్చు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ్ర΄÷డక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రం అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానుంది. తిరుగుబాటుదారుడి కథ: ‘జై హనుమాన్’ సినిమా తర్వాత రిషబ్ శెట్టి తెలుగులో మరో సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కన్నడ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ సినిమాకు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తారు.18వ శతాబ్దంలో భారత్‌లో అల్లకల్లోలంగా ఉన్న బెంగాల్ ప్రావిన్స్‌లో ఒక తిరుగుబాటుదారుడు ఎదిగిన క్రమం నేపథ్యంలో ఈ సినిమా చేయనున్నారు రిషబ్ శెట్టి. ఈ ఫిక్షనల్ హిస్టారికల్ డ్రామాలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. మొఘల్ సామ్రాజ్యాన్ని సవాల్ చేసిన యోధుడు: ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ సినిమా తెరకెక్కనుంది. ఈ బయోపిక్కు సందీప్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ హిస్టారికల్ డ్రామా 1630– 1680 మధ్యకాలంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. మొఘల్ సామ్రాజ్యాన్ని సవాల్ చేసి అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన ఓ యోధుడి కథగా ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ సినిమా రానుందని, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఏకకాలంలో 2027 జనవరి 21న రిలీజ్ చేస్తామని ఈ చిత్ర సంగీత దర్శకుడు సందీప్ రాజ్ ఆ మధ్య ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఇలా.. రెండు సంవత్సరాల వ్యవధిలో మూడు హిస్టారికల్ డ్రామా కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు రిషబ్ శెట్టి. – ముసిమి శివాంజనేయులు -
కాలాన్ని వెనక్కి తీసుకెళుతున్న హీరోలు..
కొందరు తమిళ హీరోలకు కాలం ముందుకు వెళ్లడంలేదు.. వెనక్కి వెళుతోంది. టైమ్ మిషన్ ఎక్కలేదు. మరి.. ఎలా వెనక్కి వెళ్లారంటే చారిత్రాత్మక చిత్రాలు చేస్తున్నారు. వెండితెరపై పాతకాలంలోకి వెళ్తున్నారు. ఈ పీరియాడికల్ ఫిల్మ్స్ కోసం గడియారాన్ని వెనక్కి తిప్పుతున్నారు. ఇక ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. ప్రముఖ దర్శకుడు మణిరత్నం పదో శతాబ్దం నేపథ్యంలో సాగే ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా తీశారు. కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. పదో శతాబ్దంలో చోళుల పాలన, రాజనీతి, యుద్ధనీతి వంటి అంశాల ఆధారంగా ‘పొన్నియిన్ సెల్వన్’ సాగుతుంది. ఈ పీరియాడికల్ ఫిల్మ్‌లో విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష, శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రలు పోషించారు. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి భాగం ఈ ఏడాది సెప్టెంబరు 30న విడుదల కానుంది. కాగా ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంతో పాటు మరో పీరియాడికల్ ఫిల్మ్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు విక్రమ్. పా. రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ ఓ సినిమా చేయనున్నారు. 18వ శతాబ్దపు కథతో సాగనుందని కోలీవుడ్ టాక్. ఇక హీరో సూర్య కూడా పీరియాడికల్ ఫిల్మ్స్‌లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడి వాసల్’ సినిమాలో నటిస్తున్నారు. జల్లికట్టు నేపథ్యంలో సాగే ఈ చిత్రం 18వ శతాబ్దపు నేపథ్యంలో ఉంటుంది. కాగా హీరో సూర్య, దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్లో వచ్చిన ‘సూరరై పోట్రు’ హిట్ సాధించిన విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్లో మరో సినిమా రానుంది. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమా రూపొందనుంది. అయితే ప్రస్తుతం బాల దర్శకత్వంలో ‘అచలుడు’, శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు సూర్య. ఈ రెండు చిత్రాల చిత్రీకరణలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే సూర్య చేయాల్సిన పీరియాడికల్ ఫిల్మ్ప్ పూర్తి స్థాయిలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు ‘కెప్టెన్ మిల్లర్’ అనే పీరియాడికల్ ఫిల్మ్ చేస్తున్నారు ధనుష్. 1930–1940ల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ధనుష్ హీరోగా నటించాల్సిన మరో చిత్రం ‘అయిరత్తిల్ ఒరువన్ 2’. చోళ సామ్రాజ్యానికి సంబంధించిన అంశాల పరిశోధనల నేపథ్యంలో 2010లో వచ్చిన ‘అయిరత్తిల్ ఒరువన్’ (తెలుగులో ‘యుగానికి ఒక్కడు’) చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందనుంది. అయితే తొలి భాగంలో కార్తీ హీరోగా నటించగా, మలి భాగంలో ధనుష్ హీరోగా నటిస్తారు. సీక్వెల్లో కార్తీ పాత్ర కూడా ఉంటుందనే వార్తలు వచ్చాయి. ఇక తొలి భాగానికి దర్శకత్వం వహించిన సెల్వ రాఘవన్‌నే సీక్వెల్‌నూ తెరకెక్కించనున్నారు. కాగా తమిళ, తెలుగు భాషల్లో ధనుష్ ‘సార్’ (తమిళంలో ‘వాత్తి’) సినిమా చేస్తున్నారు. వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా కథ 2000 నేపథ్యంలో సాగతుందట. ఇంకోవైపు తమిళ హీరో శివ కార్తికేయన్ ‘మహావీరన్’ (తెలుగులో ‘మహావీరుడు’) అనే సినిమా చేస్తున్నారు. టైటిల్‌ని బట్టి ఇది కూడా పీరియాడికల్ ఫిల్మ్ అయ్యుండొచ్చు. మరి కొందరు తమిళ హీరోలు కూడా పీరియాడికల్ ఫిల్మ్స్ కోసం కొత్త కథలు వింటున్నారు. -
సన్నీ గుర్రపు స్వారీ.. హల్చల్..!
సాక్షి, చెన్నై: శృంగార తారల్లో నటి సన్నీలియోన్ ప్రత్యేకం అని చెప్పకతప్పదు. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ నటనతో తన సత్తా చాటుకుంటోంది. ఈ శృంగార తార ఒక చారిత్రాత్మక కథా చిత్రంలో నటిస్తోంది. దీనికి వీరమదేవి అని పేరును ఖరారు చేశారు. హీరో భరత్ నటించిన పొట్టు చిత్రాన్ని తెరకెక్కించిన వీసి.వడివుడయాన్ దర్శకత్వం వహిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ సినిమా తమిళంలో తెరకెక్కడం. సన్నీలియోన్ వీరనారిగా నటిస్తున్న ఈ చిత్రం ఆదివారం చెన్నైలో ప్రారంభమైంది. సన్నీ కత్తి పట్టి గుర్రంపై స్వారీ చేసే సన్నివేశాన్ని దర్శకుడు తొలి షాట్‌గా చిత్రీకరించారు. ఆమె గుర్రంపై స్వారీ చేస్తుంటే ఆమె వెనుక పాతిక మంది గుర్రాలపై వెంటపడే సన్నివేశాలను సూట్ చేశారు. ఆమె చారిత్రక కథా చిత్రంలో నటించడాన్ని పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చిత్ర యూనిట్ మాత్రం వాటిని లెక్క చేయకుండా వీరమదేవి చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించింది. మరి చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత విడుదల సమయంలో ఎలాంటి సమస్యలను ఈ వీరమదేవి ఎదుర్కొనవలసి వస్తుందో వేచి చూడాలి. పైగా వీరమదేవి చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లోనూ విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. -
చివరి నిమిషంలో సన్నీ లియోన్‌కు షాక్!
సాక్షి, చెన్నై: శృంగార తార సన్నీ లియోన్‌కు ఝలక్ తగిలింది. వీరమా దేవి చిత్రం కోసం ఆదివారం చెన్నైలో నిర్వహించబోయే ఓ కార్యక్రమానికి ఆమె హాజరుకావాల్సి ఉంది. ఇంతలోనే ఆమె రాకను వ్యతిరేకిస్తూ ఓ పోలీస్ కేసు నమోదు అయ్యింది. ఉద్యమకారుడు ఎమి(ఎనోచ్ మోసెస్) సన్నీపై నజరేత్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ‘సినిమా పేరుతో సన్నీ పోర్నోగ్రఫీని ప్రమోట్ చేస్తోంది. భారత చట్టాల ప్రకారం అది నేరం. అంతేకాదు వీరమా దేవి చిత్రంలో ఆమె నటిస్తే తమిళ జాతికి అవమానం. మన సాంప్రదాయాలు దెబ్బతింటాయి. అందుకే ఆమెను అడ్డుకోండి’ అంటూ ఫిర్యాదులో ఎమి పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే తనపై కేసు నమోదు అయిన విషయం తెలియగానే ఆమె ఈవెంట్‌కు హాజరయ్యే విషయంపై పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. కానీ, నిర్వాహకులు మాత్రం సన్నీ రావటం ఖాయమని చెబుతున్నారు. భారీ బడ్జెట్‌తో తమిళ, తెలుగు, మళయాళ భాషల్లో ఏకకాలంలో వీరమాదేవి చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. -
చారిత్రక చిత్రంతో శృంగార తార..
సాక్షి, చెన్నై : స్టన్నింగ్ వార్త ఏంటో తెలుసా? శృంగార తారగా గుర్తింపు పొందిన సన్నిలియోన్ తమిళ చిత్రంలో హీరోయిన్గా నటించడం, అదీ చారిత్రక ఇతివృత్తంతో రూపొందనున్న చిత్రం కావడమే. ఇదంతా ప్రచారంలో ఉన్న విషయమే. అయితే కొత్త విషయం ఏమిటంటే ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అమ్రేశ్ సంగీత బాణీలు అందించనున్నారంట. ఆయన తొలి చిత్రం నానే ఇన్నుళ్ ఇల్లై తోనే కథానాయకుడు, సంగీత దర్శకుడు అంటూ జోడెద్దుల సవారీ చేశారు. ఆ తరువాత సంగీతంపైనే దృష్టి సారించిన అమ్రేశ్ మొట్టశివ కెట్టశివ చిత్రానికి సంగీత బాణీలు కట్టి శభాష్ అనిపించుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. అలాగే అమ్రేశ్ సంగీతం అందించిన భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే ఈ చిత్ర ఆడియోకు పరిశ్రమ వర్గాలు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. త్రిష ప్రధాన పాత్ర పోషించిన గర్జన, ప్రభుదేవా హీరోగా నటిస్తున్న యంగ్ మంగ్ ఛంగ్, ప్రభు, ప్రభుదేవా కలిసి నటిస్తున్న చార్లి చాప్లిన్–2 చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా సన్నిలియోన్ నటించనున్న చిత్రానికి సంగీతం అందించే అవకాశం అమ్రేశ్‌ను వెతుక్కుంటూ వచ్చింది. స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్సీ స్టీఫెన్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ చారిత్రాత్మక కథా చిత్రానికి వీసీ.వడివుడయాన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నారు. ఈ అవకాశంపై అమ్రేశ్ స్పందిస్తూ.. ‘చిత్ర కథ అద్భుతంగా ఉంది. ఇందులో సన్నిలియోన్‌కు భారీ పోరాట దృశ్యాలు ఉంటాయి. ఈ చిత్రానికి సంగీతం రూపొందించడానికి విదేశాలకు వెళుతున్నాం. చాలా కొత్త బాణీలను రూపొందించనున్నాను. ఆ తరుణం కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నా’ అన్నారు. -
చారిత్రాత్మక సినిమాలో సన్నీలియోన్.!
బాలీవుడ్ నటి సన్నీలియోన్ డైరెక్ట్ హీరోయిన్గా త్వరలోనే టాలీవుడ్లోకి అరంగేట్రం చేయనుంది. ఇటీవల గరుడవేగ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో అలరించిన సన్నీ చారిత్రత్మక కథతో తెరకెక్కనున్న మరో తెలుగు చిత్రంలో నటించాడానికి ఒప్పుకుంది. యుద్ద సన్నివేశాలతో తీయనున్న ఈ చిత్రంలో సన్నీలియోన్ లీడ్ రోల్ చేయనుంది. దీని కోసం కసరత్తు కూడా మోదలు పెట్టింది ఈ అమ్మడు. ముంబైలో ప్రముఖ ట్రైనర్ వద్ద కత్తి సాము, గుర్రపు స్వారీతోపాటు యుద్ధ సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్న ఈ సినిమా కోసం సన్నీలియోన్ 150 రోజుల కాల్షీట్లను ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. ఈ మూవీకి బాహుబలి, 2.0 సినిమాలకు గ్రాఫిక్స్ వర్క్ చేసిన సంస్థలు పనిచేయనున్నాయి. ఈ మూవీ టైటిల్ ను త్వరలోనే వెల్లడించనున్నారు. వీసీ వడివుడయన్ దర్శకత్వంలో స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టిఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై సన్నీలియోన్ స్పందిస్తూ ఇలాంటి ఒక అద్భుతమైన కథ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నా. ఇప్పటివరకు నాకున్న ఇమేజ్ ను పూర్తిస్థాయిలో మార్చే సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది. చాలా రోజుల నుంచి ఒక డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలనుకొంటున్నా. దర్శకుడు వి.సి.వడివుడయన్ కథ చెప్పిన మరుక్షణం నుండే ఈ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాను. యాక్షన్ సన్నివేశాల్లో నటించాలన్నది నా కల. అది ఈ సినిమాతో నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడులో నాకు మంచి ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకొచ్చింది. -
రాజా మార్తాండ వర్మగా రానా
స్టార్ వారసుడిగా వెండితెరకు పరిచయం అయి విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యువ కథానాయకుడు రానా దగ్గుబాటి. తొలి సినిమా నుంచి విభిన్న పాత్రలను ఎంచుకుంటూ సత్తా చాటుతున్న రానా.. పీరియాడిక్, హిస్టారికల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. ఇటీవల బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ భల్లాలదేవుడు, ప్రస్తుతం 1945 పేరుతో తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మరోసారి రాజు పాత్రలో కనిపించేందుకు రెడీ అవుతున్నాడు. ఫోక్ లోర్ ఫాంటసీగా తెరకెక్కిన బాహుబలిలో రాజు పాత్రలో నటించిన రానా.. త్వరలో చారిత్రక చిత్రంలో రాజు పాత్రో నటించేందుకు అంగీకరించాడు. ట్రావెన్కోర్ ను పాలించిన రాజా మార్తాండ వర్మ పాత్రలో రానా నటించనున్నాడట. కె మధు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సెవెన్ ఆర్ట్స్ మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. -
చారిత్రాత్మక చిత్రంలో శ్రుతిహాసన్
బ్రహ్మాండమైన చారిత్రాత్మక చిత్రంలో క్రేజీ హీరోయిన్ శ్రుతీహసన్ ఒక భాగం కానున్నారా? ఈ ప్రశ్నకు అలాంటి అవకాశం ఉందనే సమాధానమే కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది. శ్రుతి ఇప్పుడు మంచి జోష్‌లో ఉన్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఆ బ్యూటీ సూర్యకు జంటగా నటించిన సీ–3 మంచి విజయం సాధించింది. తాజాగా తన తండ్రి స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న శబాష్‌నాయుడు చిత్రంలో తొలిసారిగా ఆయనతో కలిసి నటిస్తున్నారు. ఇది తమిళం, తెలుగు, హింది భాషల్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం అన్నది గమనార్హం. హిందీలో బెహెన్ మోగి తెరి అనే చిత్రంతో పాటు, తెలుగులో పవన్ కల్యాణ్‌కు జంటగా కాటమరాయుడు చిత్రంలోనూ నటిస్తున్నారు. తాజాగా సంఘమిత్ర అనే హిస్టారికల్ మూవీలో నటించడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. తమిళం, తెలుగు, హిందీ బాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సుందర్.సీ దర్శకత్వం వహించనున్నారు. శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ తన నూరవ చిత్రంగా రూపొందనున్న ఇందులో ఇంతకు ముందు ఇళయదళపతి విజయ్, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు వంటి నటులతో నిర్మించాలని భావించినా వారి కాల్షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో యువ స్టార్స్ జయంరవి, ఆర్యలను కథానాయకులుగా ఎంపిక చేశారు. అదేవిధంగా వారికి జంటగా బాలీవుడ్ భామలు దీపికాపడుకునే, సోనాక్షిసిన్హాలను నటింపజేయాలనుకున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఒక కథానాయకిగా టాప్ హీరోయిన్లలో ఒకరైన శ్రుతీహాసన్ ను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఆ ఏడాది రెండవ భాగంలో సెట్‌పైకి వెళ్లనున్న సంఘమిత్ర చిత్రానికి సంబంధించిన పూర్తి వివారాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
చారిత్రక కథతోనే మోక్షజ్ఞ ఎంట్రీ..?
గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో ఘనవిజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ, తన వారసుడి ఎంట్రీకి కూడా అదే తరహా కథ అయితే కరెక్ట్ అని భావిస్తున్నాడట. అందుకే చారిత్రక కథాంశంతోనే మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. తనకు అద్భుత విజయాన్ని అందించిన క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చారిత్రక చిత్రంతో మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం అయ్యే అవకాశం ఉంది. గౌతమిపుత్ర శాతకర్ణి తరువాత వెంకటేష్ హీరోగా థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించనున్నాడు క్రిష్. ఆ సినిమా తరువాత మరోసారి బాలీవుడ్లో అక్షయ్ కుమార్ హీరోగా ఓ సినిమా చేసేందుకు అంగకీరించాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత గౌతమిపుత్ర శాతకర్ణికి సీక్వల్గా శాతకర్ణి కుమారుడు వాశిష్టిపుత్ర పులుమావి కథతో మరో భారీ చారిత్రక చిత్రాన్ని రూపొందించే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాతోనే మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.