రాజా మార్తాండ వర్మగా రానా | Rana as Raja Marthanda Varma | Sakshi
Sakshi News home page

రాజా మార్తాండ వర్మగా రానా

Nov 15 2017 1:12 PM | Updated on Aug 11 2019 12:52 PM

Rana as Raja Marthanda Varma - Sakshi

స్టార్ వారసుడిగా వెండితెరకు పరిచయం అయి విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యువ కథానాయకుడు రానా దగ్గుబాటి. తొలి సినిమా నుంచి విభిన్న పాత్రలను ఎంచుకుంటూ సత్తా చాటుతున్న రానా.. పీరియాడిక్, హిస్టారికల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. ఇటీవల బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ భల్లాలదేవుడు, ప్రస్తుతం 1945 పేరుతో తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ డ్రామాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా తరువాత మరోసారి రాజు పాత్రలో కనిపించేందుకు రెడీ అవుతున్నాడు. ఫోక్ లోర్ ఫాంటసీగా తెరకెక్కిన బాహుబలిలో రాజు పాత్రలో నటించిన రానా.. త్వరలో చారిత్రక చిత్రంలో రాజు పాత్రో నటించేందుకు అంగీకరించాడు. ట్రావెన్కోర్ ను పాలించిన రాజా మార్తాండ వర్మ పాత్రలో రానా నటించనున్నాడట. కె మధు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సెవెన్ ఆర్ట్స్ మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement