హాలీవుడ్‌ మూవీపై కరోనా ఎఫెక్ట్‌ | Mission: Impossible 7 Shooting Delayed Due To Coronavirus | Sakshi
Sakshi News home page

షూటింగ్‌ ‘ఇంపాజిబుల్‌’

Feb 26 2020 9:06 AM | Updated on Feb 26 2020 9:06 AM

Mission: Impossible 7 Shooting Delayed Due To Coronavirus - Sakshi

టామ్‌ క్రూజ్‌

ఈ సినిమాలో హీరోకి ఏదీ ఇంపాజిబుల్‌ కాదు.. అన్నీ సాధ్యం చేసేస్తాడు. కానీ కరోనా వైరస్‌ వల్ల..

హాలీవుడ్‌ యాక్షన్‌ మూవీస్‌ని ఫాలో అయ్యేవారికి ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ సిరీస్‌ గురించి తెలిసే ఉంటుంది. ‘మిషన్‌ అసాధ్యం’ అనేది టైటిల్‌ అర్థం. నిజమే.. ఇందులో హీరోకి ఏదీ అసాధ్యం కాదు. ఇప్పటివరకూ ఆరు భాగాలు వచ్చాయి. ఏడో భాగం సెట్స్‌ మీద ఉంది. అన్ని భాగాల్లోనూ హీరోగా నటిస్తూ వస్తున్న టామ్‌ క్రూజ్‌ ఏడో భాగంలోనూ హీరోగా నటిస్తున్నారు. ఇప్పుడు ఈ అమెరికన్‌ యాక్షన్‌ స్పై ఫిల్మ్‌పై కరోనా ఎఫెక్ట్‌ పడింది. ఇటలీలో మూడు వారాల షెడ్యూల్‌ని ప్లాన్‌ చేశారు. అయితే అక్కడ కరోనా వైరస్‌ వ్యాప్తి విస్తృతంగా ఉండటంతో చిత్రనిర్మాణ సంస్థ పారామౌంట్‌ పిక్చర్స్‌ ఈ షెడ్యూల్‌ని వాయిదా వేసింది. ఈ సినిమాలో హీరోకి ఏదీ ఇంపాజిబుల్‌ కాదు.. అన్నీ సాధ్యం చేసేస్తాడు. కానీ కరోనా వైరస్‌ వల్ల ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ షూటింగ్‌ ఇటలీలో ఇంపాజిబుల్‌. వచ్చే ఏడాది జూలై 23న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement