తండ్రి బాటలో...ప్రిన్స్ మైఖేల్ జాక్సన్ | Michael Jackson salsa album finally set for release | Sakshi
Sakshi News home page

తండ్రి బాటలో...ప్రిన్స్ మైఖేల్ జాక్సన్

Jan 18 2015 11:49 PM | Updated on Aug 1 2018 2:36 PM

తండ్రి బాటలో...ప్రిన్స్ మైఖేల్ జాక్సన్ - Sakshi

తండ్రి బాటలో...ప్రిన్స్ మైఖేల్ జాక్సన్

ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్‌ని మరచిపోవడం అంత సులువు కాదు. పాటల రూపంలో చిరంజీవిగా ఉన్నారాయన.

ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్‌ని మరచిపోవడం అంత సులువు కాదు. పాటల రూపంలో చిరంజీవిగా ఉన్నారాయన. మైఖేల్ అభిమానులకు ఓ శుభవార్త. ఆయన తనయుడు ప్రిన్స్ మైఖేల్ జాక్సన్ సంగీత ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. యువ పాప్‌స్టార్‌గా సంగీత అభిమానులను సంపాదించుకున్న జస్టిన్ బీబర్‌తో కలిసి ప్రిన్స్ ఓ మ్యూజిక్ ఆల్బమ్ చేస్తున్నాడని సమాచారం.
 
 కాలిఫోర్ని యాలో ఈ ఆల్బమ్ రికార్డింగ్ జరుగుతున్నట్లు భోగట్టా. ఈ ఆల్బమ్ వివరాలను గోప్యంగా ఉంచాలని ప్రిన్స్, జస్టిన్ బీబర్ భావిస్తున్నారట. ఈ ఏడాదిలోనే ఈ ఆల్బమ్ విడుదల కానుందని హలీవుడ్ టాక్. ఇప్పటికే ఈ ఆల్బమ్ గురించి ఆ నోటా ఈ నోటా మైఖేల్ జాక్సన్ అభిమానుల వరకూ వెళ్లడంతో.. తండ్రిలానే ప్రిన్స్ భేష్ అనిపించుకుంటాడనే అంచనాలతో ఉన్నారు. దానికి కారణం లేకపోలేదు. మైఖేల్ చనిపోయి ఐదేళ్లయినా ఆయన స్థానాన్ని భర్తీ చేసే పాప్ స్టార్ రాలేదు. ఆ స్థానాన్ని ప్రిన్స్ భర్తీ చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు. మరి.. ఏం జరుగుతుందో కాలమే చెప్పాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement