మెల్లిసై టీజర్ విడుదల | Mellisai teaser released | Sakshi
Sakshi News home page

మెల్లిసై టీజర్ విడుదల

Sep 15 2015 4:57 AM | Updated on Sep 3 2017 9:24 AM

మెల్లిసై టీజర్ విడుదల

మెల్లిసై టీజర్ విడుదల

తొలి చిత్రానికి సంబంధించిన ప్రతి మంచి విషయం దర్శకుడికి సంతోషంతో కూడిన ఎగ్జైట్‌మెంట్‌ను కలిగిస్తుంది...

తొలి చిత్రానికి సంబంధించిన ప్రతి మంచి విషయం దర్శకుడికి సంతోషంతో కూడిన ఎగ్జైట్‌మెంట్‌ను కలిగిస్తుంది. రంజిత్ జయకొడీ ప్రస్తుతం ఇలాంటి అనుభూతినే ఆస్వాధిస్తున్నారు. ఈయన తొలిసారిగా దర్శకత్వం విహస్తున్న చిత్రం మెల్లిసై. రెబల్ స్టూడియోస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి, గాయత్రి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్రం ఫస్ట్ పోస్టర్ ఇటీవల విడుదలై మంచి పాజిటివ్ రిపోర్టును పొందిందని చిత్ర దర్శకుడు రంజిత్ జయకొండీ పేర్కొన్నారు.

అదే విధంగా చిత్ర తొలి టీజర్‌ను సోమవారం విడుదల చేశామని దీనికి చిత్ర యూనిట్ వర్గాల నుంచి చాలా మంచి స్పందన వచ్చిందని అన్నారు. ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. ఇలా తొలి చిత్రం తొలి పోస్టర్‌కు, తొలి టీజర్‌కు మంచి స్పందన రావడం ఏ దర్శకుడికైనా ఎనలేని ఆనందానిస్తుందని రంజిత్ జయకొడీ అన్నారు. చిత్ర నాయకుడు విజయ్ సేతుపతి కూడా మెల్లిసై చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. కారణం ఈ మధ్య ఈయనకు సరైన సక్సెస్ లేదనే చెప్పాలి. ఇటీవల ఆయన నటించిన రమ్మీ, వర్మం, ఆరెంజ్ మిఠాయ్ చిత్రాలు ప్రేక్షకుల్ని నిరాశ పరిశాయి. అందువల్ల విజయ్ సేతుపతికిప్పుడు ఒక హిట్ చాలా అవసరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement