మెగాస్టార్ చెప్పిన‌ట్టే జ‌రిగింది!

Megastar Chiranjeevi Greets National Film Award Winners - Sakshi

న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ఢిల్లీలో  శుక్రవారం ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. కాగా, ఈసారి జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’,  ‘చిలసౌ’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. తెలుగు నుంచి ఉత్త‌మ చిత్రంగా మ‌హాన‌టి ఎంపికైంది. ఉత్త‌మ న‌టిగా కీర్తి సురేష్, ఉత్తమ కాస్ట్యూమ్స్‌ డిజైనర్ విభాగంలోనూ మ‌హాన‌టి ఖాతాలో అవార్డులు చేరాయి.
(చదవండి : తెలుగు సినిమాలకు జాతీయ అవార్డుల పంట)

ఇక నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను తిర‌గ‌రాసిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయకుడిగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `రంగ‌స్థ‌లం`  బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగం నుంచి అవార్డుకు ఎంపికైంది. బెస్ట్ ఒరిజిన‌ల్ స్ర్కీన్ ప్లే నుంచి చిల‌సౌ కు, ఉత్తమ మేకప్‌, విభాగంలో, ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్  విభాగంలో ‘అ..!` చిత్రానికి అవార్డులు ద‌క్కాయి. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈ ఏడాది పురస్కారాలను ఆలస్యంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా  మెగాస్టార్ చిరంజీవి అవార్డులు పొందిన వారంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. `మ‌హాన‌టి`, `రంగ‌స్థ‌లం` చిత్రాల‌కు జాతీయ అవార్డ‌లు వ‌స్తాయ‌ని ఆయ‌న‌ రిలీజ్ కు  ముందుగానే  చెప్పిన సంగ‌తి  తెలిసిందే. మ‌హాన‌టి రిలీజ్ అనంత‌రం చిరంజీవి యూనిట్ స‌భ్యుల‌ను ఇంటికి పిలిపించి ఘ‌నంగా స‌న్మానించిన సంగ‌తి విదిత‌మే. ఆయ‌న చెప్పినట్టు  ఆయా చిత్రాలకు అవార్డులు రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ న‌టించిన  `రంగ‌స్థ‌లం`కు జాతీయ అవార్డు రావ‌డం.  అలాగే ఇత‌ర భాష‌ల నుంచి అవార్డుల‌కు ఎంపికైన వారంద‌రికీ మెగాస్టార్ అభినంద‌న‌లు తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top