‘మణికర్ణిక’ టీజర్‌ రెడీ..!

Manikarnika Gets Its Teaser Launch Date - Sakshi

టాలీవుడ్ దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా మణికర్ణిక. ఇప్పటికే పలు వివాదాలతో వార్తల్లో ఉంటున్న ఈ సినిమా ఫైనల్‌గా రిలీజ్‌కు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్‌ చేయనున్నారు.

కంగనా రనౌత్‌ ఝాన్సీ లక్ష్మీ బాయ్‌ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్‌ కథ అందించారు. మేజర్‌ పార్ట్‌కు క్రిష్ దర్శకత్వం వహించగా చివర్లో కొన్ని సన్నివేశాలతో పాటు ప్యాచ్‌ వర్క్‌కు కంగనా దర్శకత్వం వహించారు. ఆ సమయంలో కంగన వ్యవహార శైలిపై ఆరోపణలు వచ్చాయి. అం‍తేకాదు దర్శకురాలిగా కంగనా పేరునే టైటిల్స్‌ లో వేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఈ అనుమానాలన్నింటికి టీజర్‌తో సమాధానమివ్వనున్నారు చిత్రయూనిట్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top