నా పాత్రను తగ్గించేశారు | Manikarnika actress Mishti Chakravarty blasts Kangana Ranaut for chopping her role | Sakshi
Sakshi News home page

నా పాత్రను తగ్గించేశారు

Jan 31 2019 2:38 AM | Updated on Aug 21 2019 10:25 AM

Manikarnika actress Mishti Chakravarty blasts Kangana Ranaut for chopping her role - Sakshi

మిస్తీ చక్రవర్తి

‘మణికర్ణిక’ చిత్రం మంచి కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో కంగనా రనౌత్‌ నటనను ప్రేక్షకులు అభినందిస్తున్నా, ఆమె ప్రవర్తనను  మాత్రం తోటి టెక్నీషియన్స్‌ విమర్శిస్తున్నారు. దర్శకత్వం విషయంలో క్రిష్‌ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘నా పాత్రను నిర్దాక్షిణ్యంగా తగ్గించేశారని అందులో నటించిన హీరోయిన్‌ మిస్తీ చక్రవర్తి ఆరోపించారు. ‘‘మణికర్ణిక’ సినిమాలో నా పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని, మంచి సన్నివేశాలున్నాయని క్రిష్‌గారు నాతో చెప్పారు. అలానే అద్భుతమైన సన్నివేశాలు చిత్రీకరించారు కూడా. కానీ, అవన్నీ సినిమాలో కనిపించలేదు. సినిమా పూర్తయ్యాక మళ్లీ కొన్ని సన్నివేశాలు షూట్‌ చేయడానికి కంగనా నన్ను డేట్స్‌ అడిగారు. అప్పుడు తీసిన సన్నివేశాలను మొదట షూట్‌ చేసినవాటి స్థానంలో చేర్చారు. ఒకవేళ కంగనానే దర్శకురాలని ముందే తెలిసుంటే ఈ సినిమా చేసుండేదాన్ని కాదు’’ అని పేర్కొన్నారు మిస్తీ.

Advertisement
 
Advertisement
Advertisement