మణిరత్నం సినిమాలో మళ్లీ!

Mani Ratnam’s next to roll from January 2018; Prakash Raj, Jayasudha to play key roles - Sakshi - Sakshi

‘హిట్‌ పెయిర్‌’ పేరుతో ఓ జంట మళ్లీ మళ్లీ స్క్రీన్‌పై కన్పిస్తుంటే కొన్నాళ్లకు బోర్‌ కొట్టేస్తారు. కానీ, ఎన్నేళ్లైనా వెండితెరపై వన్నె తరగని జంటలు కొన్ని ఉంటాయి. విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్, సహజ నటి జయసుధలది అలాంటి జంటే. ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’, ‘బొమ్మరిల్లు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.. ఇలా చెప్పుకోవడానికి చాలా సినిమాలున్నాయి! గతేడాది జాతీయ అవార్డు సాధించిన ‘శతమానం భవతి’తో సహా! జయసుధ, ప్రకాశ్‌రాజ్‌లు వైఫ్‌ అండ్‌ హజ్బెండ్‌గా నటించిన ప్రతి సిన్మాలోనూ ప్రేక్షకులను తమ నటనతో మెస్మరైజ్‌ చేశారు.

‘హిట్‌ పెయిర్‌’ అనే పదానికి కరెక్ట్‌ ఎగ్జాంపుల్‌గా నిలుస్తున్నారు. తాజాగా మణిరత్నం దర్శకత్వం వహించనున్న తమిళ సినిమాలోనూ ఈ ‘హిట్‌ పెయిర్‌’ వైఫ్‌ అండ్‌ హజ్బెండ్‌గా నటించేందుకు అంగీకరించారు. హీరోలు అరవింద్‌ స్వామి, శింబు, ఫాహద్‌ ఫాజిల్‌ వీళ్ల తనయులుగా కనిపిస్తారట. మరో హీరో విజయ్‌ సేతుపతి ఇన్‌స్పెక్టర్‌గా నటించనున్న ఈ సినిమాలో హీరోయిన్లు జ్యోతిక, ఐశ్వర్యా రాజేశ్‌లు కీలక పాత్రధారులు. జనవరిలో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది!!

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top