లుక్‌ అదిరింది | Manchu Manoj is first look Release from Aham Brahmasmi | Sakshi
Sakshi News home page

లుక్‌ అదిరింది

Mar 5 2020 12:55 AM | Updated on Mar 5 2020 4:50 AM

Manchu Manoj is first look Release from Aham Brahmasmi - Sakshi

మంచు మనోజ్‌

మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ సిల్వర్‌ స్క్రీన్‌పై తన ఎనర్జీని చూపించడానికి రెడీ అయ్యారు మంచు మనోజ్‌. కమ్‌బ్యాక్‌ సినిమాగా ‘అహం బ్రహ్మస్మి’ అనే ప్యాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నారాయన. శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని మంచు మనోజ్, నిర్మలా దేవి నిర్మిస్తున్నారు. ప్రియా భవానీశంకర్‌ కథానాయికగా కనిపిస్తారని సమాచారం. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను బుధవారం విడుదల చేశారు. ఫస్ట్‌ లుక్‌ అందరి దృష్టినీ  ఆకర్షించేలా ఉంది.  సినిమా ఎలా ఉండబోతోందో అనే ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. రేపు ఈ సినిమా ముహూర్తం జరగనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement