సినిమా చూసి థ్రిల్‌ అవుతారు | Mama O Chandamama Pre Release Event | Sakshi
Sakshi News home page

సినిమా చూసి థ్రిల్‌ అవుతారు

Dec 11 2017 1:07 AM | Updated on Dec 11 2017 1:09 AM

Mama O Chandamama Pre Release Event  - Sakshi

రామ్‌ కార్తీక్, సనా మక్బూల్‌ఖాన్‌ జంటగా విశాఖ థ్రిల్లర్‌ వెంకట్‌ దర్శకత్వంలో బొడ్డు శ్రీలక్ష్మి సమర్పణలో వరప్రసాద్‌ బొడ్డు నిర్మించిన ‘మామ ఓ చందమామ’ చిత్రం ఈ నెల 15న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. హీరో రాజశేఖర్‌ మాట్లాడుతూ– ‘‘సుమన్‌గారు బిజీగా ఉండటంతో ‘వందేమాతరం’ సినిమాలో టి.కృష్ణగారు నాకు అవకాశం ఇచ్చారు. సుమన్‌గారి వల్లే నేను హీరో అయ్యా.  ట్రైలర్‌ చుశాను. ఈ సినిమా హిట్‌ అవుతుంది’’ అని అన్నారు.

 ‘‘వెంకట్‌ కథ చెప్పగానే చాలా థ్రిల్‌ అయ్యాను. ఇలాంటి క్యారెక్టర్‌ ఎప్పుడూ చెయ్యలేదు. ‘గరుడవేగ’తో మంచి హిట్‌ కొట్టిన రాజశేఖర్‌కి కంగ్రాట్స్‌’’ అన్నారు నటుడు సుమన్‌. ‘‘రామ్‌గోపాల్‌ వర్మగారి స్ఫూర్తితో డైరెక్టర్‌ అవ్వాలని వైజాగ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చా. కథ చెప్పగానే సినిమా చేద్దామని ముందుకు వచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్‌. సినిమా చూసి ప్రేక్షకులు థ్రిల్‌ అవుతారన్న నమ్మకం ఉంది.’’ అన్నారు వెంకట్‌. సీనియర్‌ నటి గీతాంజలి, రామ్‌ కార్తీక్, సనా మక్బూల్‌ఖాన్, రచయిత చిన్నికృష్ణ, నటి జీవిత, నిర్మాత రాజ్‌ కందుకూరి, చిత్రబృందం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement