breaking news
mama o chandamama
-
సినిమా చూసి థ్రిల్ అవుతారు
రామ్ కార్తీక్, సనా మక్బూల్‌ఖాన్ జంటగా విశాఖ థ్రిల్లర్ వెంకట్ దర్శకత్వంలో బొడ్డు శ్రీలక్ష్మి సమర్పణలో వరప్రసాద్ బొడ్డు నిర్మించిన ‘మామ ఓ చందమామ’ చిత్రం ఈ నెల 15న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. హీరో రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘సుమన్‌గారు బిజీగా ఉండటంతో ‘వందేమాతరం’ సినిమాలో టి.కృష్ణగారు నాకు అవకాశం ఇచ్చారు. సుమన్‌గారి వల్లే నేను హీరో అయ్యా. ట్రైలర్ చుశాను. ఈ సినిమా హిట్ అవుతుంది’’ అని అన్నారు. ‘‘వెంకట్ కథ చెప్పగానే చాలా థ్రిల్ అయ్యాను. ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడూ చెయ్యలేదు. ‘గరుడవేగ’తో మంచి హిట్ కొట్టిన రాజశేఖర్‌కి కంగ్రాట్స్’’ అన్నారు నటుడు సుమన్. ‘‘రామ్‌గోపాల్ వర్మగారి స్ఫూర్తితో డైరెక్టర్ అవ్వాలని వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చా. కథ చెప్పగానే సినిమా చేద్దామని ముందుకు వచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్. సినిమా చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారన్న నమ్మకం ఉంది.’’ అన్నారు వెంకట్. సీనియర్ నటి గీతాంజలి, రామ్ కార్తీక్, సనా మక్బూల్‌ఖాన్, రచయిత చిన్నికృష్ణ, నటి జీవిత, నిర్మాత రాజ్ కందుకూరి, చిత్రబృందం పాల్గొన్నారు. -
చందమామ నవ్వులు!
రామ్‌కార్తీక్, సనా మక్బూల్ జంటగా తెరకెక్కుతోన్న కామెడీ ఎంటర్టైనర్ ‘మామ.. ఓ చందమామ’. ‘విశాఖ థ్రిల్లర్స్’ వెంకట్ దర్శకత్వంలో శ్రీమతి బొడ్డు లక్ష్మి సమర్పణలో వరప్రసాద్ బొడ్డు నిర్మిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘కుటుంబ విలువలు, హాస్యానికి ప్రాధాన్యం ఇచ్చిన చిత్రమిది. పసలపూడిలో నవంబర్ 11న ప్రారంభించిన తొలి షెడ్యూల్ పూర్తి చేశాం. ఈ నెలాఖరున రెండో షెడ్యూల్ మొదలు పెడతాం’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా దర్శకుడు ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. కెమెరామ్యాన్ బాబు కోనసీమ అందాలను బాగా చూపిస్తున్నారు. ఫిబ్రవరిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని రామ్ కార్తీక్ చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: మురళి సాధనాల.