ఈ ‘మలుపు’ మంచి గెలుపు కావాలి | malupu movie first look lunched | Sakshi
Sakshi News home page

ఈ ‘మలుపు’ మంచి గెలుపు కావాలి

Nov 15 2014 1:11 AM | Updated on Sep 2 2017 4:28 PM

ఈ ‘మలుపు’ మంచి గెలుపు కావాలి

ఈ ‘మలుపు’ మంచి గెలుపు కావాలి

యుముడికి మొగుడు,చంటి, పెదరాయుడు... ఇలా పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన రికార్డ్ రవిరాజా పినిశెట్టిది.

యుముడికి మొగుడు, చంటి, పెదరాయుడు... ఇలా పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన రికార్డ్ రవిరాజా పినిశెట్టిది. ఇప్పుడాయన పెద్దకొడుకు సత్యప్రభాస్ తండ్రిలాగా మెగాఫోన్ పట్టారు. తొలి ప్రయత్నంగా తన తమ్ముడు, ‘గుండెల్లో గోదారి’ ఫేమ్ ఆది పినిశెట్టి హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో ‘మలుపు’, తమిళంలో ‘యాగవరాయనుమ్ నా కాక్క’ పేరుతో రవిరాజా పినిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను నిర్మాత సి. కల్యాణ్, ప్రచార చిత్రాన్ని దర్శకుడు కె.రాఘవేంద్రరావు, డిజిటల్ ప్రచార చిత్రాన్ని గుణ్ణం గంగరాజు ఆవిష్కరించారు. ఈ ‘మలుపు’ సత్యప్రభాస్, ఆదికి గెలుపు కావాలని ఈ సందర్భంగా రాఘవేంద్రరావు శుభాకాంక్షలు అందించారు. ‘రాశీ మూవీస్’ నరసింహారావు, దర్శక, నిర్మాత సాగర్, నటుడు నారాయణరావు తదితరులు ప్రచార చిత్రాలు బాగున్నాయని పేర్కొన్నారు.

రవిరాజా పినిశెట్టి మాట్లాడుతూ-‘‘నటుడిగా ఆది ఇప్పటికే నిరూపించుకున్నాడు. దర్శకునిగా సత్యప్రభాస్ తొలి అడుగు వేశాడు. ఇది నా తొలి చిత్రం అయ్యుంటే నేనింత బాగా తీసి ఉండేవాణ్ణి కాదేమో’’ అన్నారు. అన్నయ్య దర్శకత్వంలో నాన్న నిర్మించిన ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని ఆది చెప్పారు. ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డామనీ, బాగా తీశాననే నమ్మకం ఉందని సత్యప్రభాస్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement