అఖిల్‌.. రానా.. ప్రభాస్‌... ఓ సినిమా! | Baahubali actor Rana Daggubati to turn producer with Akhil Akkineni's 3rd film | Sakshi
Sakshi News home page

అఖిల్‌.. రానా.. ప్రభాస్‌... ఓ సినిమా!

Jan 6 2018 12:19 AM | Updated on Aug 11 2019 12:52 PM

Baahubali actor Rana Daggubati to turn producer with Akhil Akkineni's 3rd film - Sakshi

ఇంకా ఫోర్‌ డేస్‌ టైమ్‌ ఉంది. ఎందుకు? అంటే... హీరో అఖిల్‌ కొత్త సినిమా ఎనౌన్స్‌మెంట్‌కి. రీసెంట్‌గా జరిగిన ప్రెస్‌మీట్‌లో నెక్ట్స్‌ సినిమాను జనవరి 10లోపు ఎనౌన్స్‌ చేస్తానని అఖిల్‌ చెప్పారు. కానీ అఖిల్‌ కంటే ముందే ఫిల్మ్‌నగర్‌లో ఓ ఎనౌన్స్‌మెంట్‌ స్ట్రాంగ్‌గా వినిపిస్తోంది. అదేంటంటే.. దర్శకుడు రవిరాజా పినిశెట్టి పెద్ద కుమారుడు సత్యప్రభాస్‌ పినిశెట్టి దర్శకత్వంలో అఖిల్‌ తన నెక్ట్స్‌ సినిమా చేయబోతున్నారట. అంతేకాదు హీరో రానా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తారట.

తమిళంలో ‘యాగవరాయినుమ్‌ నా కాక్క’ సినిమాను డైరెక్ట్‌ చేశారు సత్యప్రభాస్‌. తెలుగులో ‘మలుపు’ టైటిల్‌తో ఈ సినిమా రిలీజైంది. ఇందులో సత్య ప్రభాస్‌ తమ్ముడు అదేనండి.. రవిరాజా పినిశెట్టి చిన్న కుమారుడు ఆది పినిశెట్టి హీరోగా నటించారు. ‘మలుపు’ తర్వాత సత్యప్రభాస్‌ స్క్రిప్ట్‌ రెడీ చేసే పనిలో బిజీ అయ్యారట. ఆ కథతోనే అక్కినేని కాంపౌండ్‌ని అప్రోచ్‌ అయ్యారని సమాచారం. మరి.. అఖిల్‌ హీరోగా ప్రభాస్‌ దర్శకత్వంలో రానా నిర్మాతగా సినిమా ఉంటుందా? వెయిట్‌ అండ్‌ సీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement