మేకప్‌మ్యాన్ కోసం ఫ్రీగా సినిమా! | makeup man the film for free! | Sakshi
Sakshi News home page

మేకప్‌మ్యాన్ కోసం ఫ్రీగా సినిమా!

Apr 11 2015 1:21 AM | Updated on Sep 3 2017 12:07 AM

మేకప్‌మ్యాన్ కోసం  ఫ్రీగా సినిమా!

మేకప్‌మ్యాన్ కోసం ఫ్రీగా సినిమా!

సినీ తారలు తమ దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న సిబ్బంది కోసం సినిమాలు చేయడం లేదా వారి సినీ నిర్మాణంలో భాగస్వామ్యం కావడం

సినీ తారలు తమ దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న సిబ్బంది కోసం సినిమాలు చేయడం లేదా వారి సినీ నిర్మాణంలో భాగస్వామ్యం  కావడం అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటుంది.  అందాల తార అనుష్క తన మేకప్ మ్యాన్ కోసం ‘పంచాక్షరి’ సినిమాలో నటిస్తే,  తమిళ సూపర్‌స్టార్ అజిత్ ఓ అడుగు ముందుకు వేసి తన సిబ్బంది కోసం ఇళ్లు కట్టించే పనిలో ఉన్నారు. ఈ జాబితాలోకి బాలీవుడ్ నటి జుహీచావ్లా కూడా చేరిపోయారు.  జుహీ చావ్లా దగ్గర 18 ఏళ్ల నుంచి మేకప్ మ్యాన్‌గా పనిచేస్తున్న సుభాష్ సింగ్ త్వరలో ఓ సినిమా చేయనున్నారు. ఇందులో జుహీదీ కీలక పాత్ర.

దాంతో పాటు ఇంకో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారట జుహీ. ఈ సినిమా స్క్రిప్ట్ బాగా నచ్చడంతో,  పారితోషికం కూడా తీసుకోకుండానే నటిస్తానని హామీ ఇచ్చారట. ఈ సినిమాలో జాకీష్రాఫ్, సీనియర్ నటి షబానా అజ్మీ కూడా ఏ పారితోషికం తీసుకోకుండానే నటి ంచడానికి ఒప్పుకున్నారని సుభాష్ సింగ్ చాలా సంబరపడిపోతూ చెప్పారు.    
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement