భరత్‌ అనే నేను | Mahesh Babu's First Look From Bharath Ane Nenu | Sakshi
Sakshi News home page

భరత్‌ అనే నేను

Jan 27 2018 12:16 AM | Updated on May 10 2018 12:13 PM

Mahesh Babu's First Look From Bharath Ane Nenu - Sakshi

మహేశ్‌బాబు

... శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని...’’ ఆంధ్రప్రదేశ్‌ సీయంగా శుక్రవారం ఉదయం ఏడు గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు మహేశ్‌బాబు. కొరటాల శివ దర్శకత్వంలో డి. పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘భరత్‌ అనే నేను’. ఇందులో కియారా అద్వాని కథానాయిక.

శుక్రవారం ఉదయం ఏడు గంటలకు మహేశ్‌బాబు వాయిస్‌ ఫస్ట్‌ ఓత్‌ను, ఎనిమిది గంటలకు లోగో, తొమ్మిది గంటలకు ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు చిత్రబృందం. కాగా, మహేశ్‌ ప్రమాణ స్వీకారం విన్నవాళ్లు అచ్చు ఆయన తండ్రి సూపర్‌ స్టార్‌ కృష్ణ గొంతులానే ఉందంటున్నారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌ విడిపోకముందు జరిగే ఫిక్షనల్‌ పొలిటికల్‌ డ్రామా ఇది. సినిమా ప్రమోషన్‌కు రిపబ్లిక్‌ డే మంచి సందర్భమని భావించి ప్రమోషన్‌ను స్టార్ట్‌ చేశాం’’ అన్నారు కొరటాల శివ. ‘‘ఫస్ట్‌ లుక్‌కి సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి రామ్‌–లక్ష్మణ్‌ నేతృత్వంలో క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుగుతోంది. మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు దానయ్య. ప్రకాశ్‌రాజ్, శరత్‌కుమార్‌ కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి  దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త. ఏప్రిల్‌లో చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement