ఈ సారి పవన్ కాదు.. మహేష్..? | Mahesh babu to attend Lie Pre release event | Sakshi
Sakshi News home page

ఈ సారి పవన్ కాదు.. మహేష్..?

Aug 3 2017 11:43 AM | Updated on Mar 22 2019 5:33 PM

ఈ సారి పవన్ కాదు.. మహేష్..? - Sakshi

ఈ సారి పవన్ కాదు.. మహేష్..?

యంగ్ హీరో నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. సినిమా ఫంక్షన్స్ లో

యంగ్ హీరో నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. సినిమా ఫంక్షన్స్ లో తన అభిమానాన్ని చాలా సార్లు బహిరంగంగానే చాటుకున్నాడు నితిన్. పవన్ కు కూడా నితిన్ అంటే చాలా అభిమానం. తన ఫ్యామిలీ హీరోల ఫంక్షన్లకు మిస్ అయ్యి నితిన్ సినిమాల వేడుకల్లో మాత్రం తరుచూ కనిపిస్తుంటాడు. అయితే ఈ సారి మాత్రం నితిన్ రూట్ మార్చాడు.

నితిన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం లై ప్రీ రిలీజ్ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హజరుకానున్నాడట. లై సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ తో ఉన్న అనుబంధం కారణంగా మహేష్ ప్రీరిలీజ్ వేడుకకు వచ్చేందుకు అంగీకరించాడు. ప్రస్తుతం మహేష్ స్పైడర్ తో పాటు కొరటాల శివ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందుకే మహేష్ ఫ్రీ టైం చూసుకొని ప్రీ రిలీజ్ డేట్ ఇచ్చే ప్లాన్ లో ఉన్నారు లై యూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement