'ప్రిన్స్'కు నచ్చిన కుమారి | Mahesh babu comments on sukumar's kumari 21f | Sakshi
Sakshi News home page

'ప్రిన్స్'కు నచ్చిన కుమారి

Oct 4 2015 8:35 AM | Updated on Sep 3 2017 10:26 AM

'ప్రిన్స్'కు నచ్చిన కుమారి

'ప్రిన్స్'కు నచ్చిన కుమారి

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రూటు మార్చాడు. తన సినిమాల విషయంలోనే కాదు ఇతర హీరోలు, దర్శకుల సినిమాలను ప్రశంసిస్తూ తన పెద్ద మనసు చాటుకుంటున్నాడు. బాహుబలి...

'ప్రిన్స్' మహేష్ బాబు రూటు మార్చాడు. తన సినిమాల విషయంలోనే కాదు ఇతర హీరోలు, దర్శకుల సినిమాలను ప్రశంసిస్తూ తన పెద్ద మనసు చాటుకుంటున్నాడు. బాహుబలి రిలీజ్ సమయంలో తన సినిమాను వాయిదా వేసుకున్న మహేష్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల మనసు కూడా గెలుచుకున్నాడు. అంతేకాదు ఇటీవల చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని చిత్రయూనిట్లకు అభినందనలు తెలియజేస్తున్నాడు.

సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న కుమారి 21ఎఫ్ సినిమా విషయంలో ఇలాగే స్పందించాడు మహేష్. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ పై ప్రశంసల జల్లు కురింపించాడు. 'కుమారి 21ఎఫ్ టీజర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. రత్నవేలు ఛాయాగ్రహణం, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం చాలా బాగున్నాయి. సుకుమార్ టీమ్ కు నా అభినందనలు' అంటూ ట్విట్టర్ లో తన శుభాకాంక్షలు తెలియజేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement