మేజర్‌ అజయ్‌కృష్ణ

Mahesh Babu begins shooting for his next Sarileru Neekevvaru in kashmir - Sakshi

కశ్మీర్‌లో ఆపరేషన్‌ షురూ చేశారు మేజర్‌ అజయ్‌కృష్ణ. ఈ ఆపరేషన్‌ డీటైల్స్‌ వచ్చే ఏడాది సంక్రాంతికి సిల్వర్‌ స్క్రీన్‌పై చూడొచ్చు. మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో మేజర్‌ అజయ్‌కృష్ణ పాత్రలో మహేశ్‌బాబు నటిస్తున్నారు. రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ కశ్మీర్లో జరుగుతోంది. నెక్ట్స్‌ షెడ్యూల్‌ను టీమ్‌ హైదరాబాద్‌లో ప్లాన్‌ చేసినట్లు తెలిసింది. ‘దిల్‌’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్‌ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా విజయశాంతి నటిగా రీ–ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top