పద్మావతిపై మధ్యప్రదేశ్‌ సంచలన నిర్ణయం | Madhya Pradesh Government bans Sanjay Leela Bhansali’s ‘Padmavati’ | Sakshi
Sakshi News home page

పద్మావతిపై మధ్యప్రదేశ్‌ సంచలన నిర్ణయం

Nov 20 2017 3:20 PM | Updated on Nov 20 2017 3:20 PM

Madhya Pradesh Government bans Sanjay Leela Bhansali’s ‘Padmavati’ - Sakshi

సాక్షి,భోపాల్‌: వివాదాస్పద పద్మావతి మూవీపై మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పద్మావతి చిత్రాన్ని తమ రాష్ట్రంలో నిషేధిస్తున్నట్టు ఎంపీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ చెప్పారు.చరిత్రను వక్రీకరించిన పద్మావతి చిత్రంపై నిషేధం విధించాలని రాజ్‌పుట్‌ సంఘాలు వినతి పత్రం ఇచ్చిన మీదట సీఎం చౌహాన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సెన్సార్‌ సమస్యల నేపథ్యంలో డిసెంబర్‌ 1న విడుదల కావాల్సిన పద్మావతి మూవీని వాయిదా వేస్తున్నట్టు చిత్ర మేకర్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

సెన్సార్‌ సర్టిఫికేషన్‌ కోసం అవసరమైన పత్రాలను ఇవ్వలేదని సెన్సార్‌ బోర్డ్‌ చీఫ్‌ ప్రసూన్‌ జోషి పేర్కొన్నారు. మరోవైపు బోర్డు సర్టిఫికెట్‌ పొందకుండానే పలు మీడియా ఛానెళ్లకు చిత్రాన్ని ప్రదర్శించడం పట్ల జోషి అభ్యంతరం వ్యక్తం చేశారు. సెన్సార్‌ సర్టిఫికెట్‌ కోసం చేసిన దరఖాస్తు అసంపూర్తిగా ఉందంటూ చిత్రాన్ని సీబీఎఫ్‌సీ నిర్మాతకు తిప్పిపంపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement