
బాహుబలిలో మాధురి..?
భారతీయ చలనచిత్ర రికార్డులను తిరగరాసిన బాహుబలి. అంతటి ఘనవిజయం సాధించిన తరువాత ఆ సినిమా సీక్వెల్పై ఇప్పుడు భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.
భారతీయ చలనచిత్ర రికార్డులను తిరగరాసిన బాహుబలి. అంతటి ఘనవిజయం సాధించిన తరువాత ఆ సినిమా సీక్వెల్పై ఇప్పుడు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే సినిమాకు సంబంధించి రోజుకో వార్త టాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. తొలి భాగం ఘనవిజయం సాధించటంతో సీక్వెల్ను మరింత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్కు మరిన్ని హంగులను సమకూర్చే పనిలో బిజీగా ఉన్నాడు.
బాహుబలి రిలీజ్ ప్రమోషన్ తరువాత ఈ మధ్యే బాహుబలి 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టాడు. అయితే ఈ సినిమాలో నటించడానికి చాలామంది స్టార్లు ఇంట్రస్ట్ చూపిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే తమిళ స్టార్ హీరో సూర్య, అతిలోక సుందరి శ్రీదేవి, స్టార్ హీరోయిన్ శ్రియ ఈ సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు వినిపించాయి. చిత్రయూనిట్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వలేదు.
తాజాగా బాహుబలి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త తెర మీదకు వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ బాహుబలి సీక్వెల్లో కీలకపాత్రలో నటించనుందట. తొలి భాగంలో కొన్ని సీన్లకు మాత్రమే పరిమితమైన అనుష్క రెండో భాగంలో మెయిన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సీన్లలో అనుష్క అక్కగా మాధురి కనిపించనుందన్న వార్త ఇప్పుడు ఫిలింనగర్లో హాట్ టాపిక్గా మారింది. మరి ఈ విషయాన్నైనా చిత్రయూనిట్ నిర్ధారిస్తారో లేక గాసిప్ గానే కొట్టి పారేస్తారో చూడాలి.