
మాధురీ దీక్షిత్
వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెడుతున్న స్టార్స్ జాబితాలోకి మాధురీ దీక్షిత్ కూడా జాయిన్ అయిపోయారు. ఇటీవలే సమంత, కియారా అద్వానీ, రాధికా ఆప్టే, జాన్వీ కపూర్ వెబ్‌లో అడుగుపెట్టారు. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ రూపొందించబోయే ఓ వెబ్ సిరీస్‌లో మాధురీ లీడ్ రోల్‌లో నటించనున్నారు. ఈ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్‌తో కలసి కరణ్ జోహార్ నిర్మిస్తారు. ‘‘నెట్‌ఫ్లిక్స్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. గతంలో నెట్‌ఫ్లిక్స్ కోసం ‘ఆగస్ట్ 15’ అనే మరాఠీ చిత్రాన్ని నిర్మించాను. మేం చేయబోయే సిరీస్ వినోదాత్మకంగా, హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది’’ అని పేర్కొన్నారు మాధురీ దీక్షిత్. శ్రీ రావ్ దర్శకత్వం వహించనున్న ఈ వెబ్‌సిరీస్ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది.