మధుర్ భండార్కర్ ‘కేలండర్ గర్ల్స్’ | Madhur Bhandarkar releases Calender girls first look with wearing Gold colored bikinis | Sakshi
Sakshi News home page

మధుర్ భండార్కర్ ‘కేలండర్ గర్ల్స్’

Aug 26 2014 12:09 AM | Updated on Sep 2 2017 12:26 PM

మధుర్ భండార్కర్ ‘కేలండర్ గర్ల్స్’

మధుర్ భండార్కర్ ‘కేలండర్ గర్ల్స్’

బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ తన తదుపరి చిత్రం ‘కేలండర్ గర్ల్స్’ కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు. తాజాగా ‘కేలండర్ గర్ల్స్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు.

బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ తన తదుపరి చిత్రం ‘కేలండర్ గర్ల్స్’ కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు. తాజాగా ‘కేలండర్ గర్ల్స్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్‌లో బంగారు వన్నె బికినీలు ధరించిన ఐదుగురు భామల ముఖాలు కనిపించకుండా టోపీలు అడ్డుపెట్టడంతో వారెవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సినిమా పూర్తయ్యేంత వరకు వారెవరనేది గోప్యంగా ఉంచాలని భండార్కర్ భావిస్తున్నట్లు సమాచారం.
 
‘వీరా’తో గాయని శిబానీ తెరంగేట్రం
బాలీవుడ్ గాయని శిబానీ కాశ్యప్ ‘వీరా’ చిత్రం ద్వారా తెరంగేట్రం చేయనుంది. ఇప్పటి వరకు అడపా దడపా వీడియో ఆల్బమ్స్‌లో కనిపించిన శిబానీకి నటిగా ఇదే మొదటి చిత్రం కానుంది. ‘వీరా’లో తనకు ఆఫర్ చేసిన పాత్ర నచ్చిందని, ఇందులో పాత్ర తన జీవితానికి దగ్గరగా ఉండటంతో నటించడానికి అంగీకరించానని ఆమె చెప్పింది.
 
పరుగు బాలుడి జీవితంపై చిత్రం

నాలుగేళ్ల వయసులోనే మారథాన్ పూర్తి చేసిన ఒడిశా పరుగు బాలుడు బుధియా సింగ్ జీవితం ఆధారంగా త్వరలోనే చిత్రం తెరకెక్కనుంది. ఒరియా దర్శకుడు సౌమేంద్ర పాఢి దీని రూపకల్పన కోసం సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ చిత్రంలో బుధియా కోచ్ బిరంచి దాస్ పాత్రను బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయి పోషించనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement