ధైర్యం చేస్తే దక్కిన తీయటి ఫలితం! | Madhubala joins Nikhil for Surya vs Surya | Sakshi
Sakshi News home page

ధైర్యం చేస్తే దక్కిన తీయటి ఫలితం!

Nov 12 2014 1:09 AM | Updated on Sep 2 2017 4:16 PM

ధైర్యం చేస్తే దక్కిన తీయటి ఫలితం!

ధైర్యం చేస్తే దక్కిన తీయటి ఫలితం!

ప్రయోగాత్మకంగా రూపొందే చిన్న చిత్రాలకు డబ్బులు రావంటారు. కానీ, ధైర్యం చేసి ‘స్వామి రారా’ చేశాను.

- నిఖిల్
‘‘ప్రయోగాత్మకంగా రూపొందే చిన్న చిత్రాలకు డబ్బులు రావంటారు. కానీ, ధైర్యం చేసి ‘స్వామి రారా’ చేశాను. మంచి ఫలితం వచ్చింది. ఆ ప్రేరణతోనే ఇప్పుడు ‘కార్తికేయ’ చేశాను. ఇది నా కెరీర్‌లోనే మైలురాయిలా నిలిచింది. ప్రస్తుతం చేస్తున్న ‘సూర్య వర్సెస్ సూర్య’ కూడా వాణిజ్య విలువలతో కూడిన ప్రయోగాత్మకమే’’ అని నిఖిల్ అన్నారు. ఆయన హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన ‘కార్తికేయ’ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో నిఖిల్ మాట్లాడుతూ-‘‘సినిమా చూద్దామని నేను, దర్శకుడు చందు కలిసి థియేటర్‌కెళ్లాం. టికెట్లు దొరకలేదు.

బాధ అనిపించినా, తర్వాత భలే ఆనందపడ్డాం. మూడోవారంలోనూ తరగని వసూళ్లతో దూసుకుపోతోందీ సినిమా’’ అన్నారు. చందు ఏది నమ్మాడో అదే తీశాడనీ, ఈ సక్సెస్‌కి కారణం అదే అనీ నిర్మాత అన్నారు. సినిమా హిట్ అవుతుందని ముందే అనుకున్నామనీ, కానీ సూపర్‌హిట్ చేశారని దర్శకుడు ఆనందం వెలిబుచ్చారు. ఇప్పటికి 20 కోట్ల గ్రాస్ వసూలు చేసిందీ సినిమా అని నిర్మా  తల్లో ఒకరైన మార్కాపురం శివకుమార్ అన్నారు. జోగి నాయుడు తదితరులు మాట్లాడారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement