మాధవన్‌ ఆనందం.. తనయుడి గెలుపు | Madhavan Share Video In Instagram Of His Son Vedaant Winning Swimming Event ​ | Sakshi
Sakshi News home page

మాధవన్‌ ఆనందం.. తనయుడి గెలుపు

Jan 30 2020 8:39 PM | Updated on Jan 30 2020 8:50 PM

Madhavan Share Video In Instagram Of His Son Vedaant Winning Swimming Event ​ - Sakshi

సాధారణంగా సినిమా సెలబ్రిటీలు తమ పిల్లలకు సంబంధించిన విషయాలను సోషల్‌ మీడియాలో అభిమానలతో పంచుకుంటారు. అయితే మాధవన్‌ తన తనయుడికి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. మాధవన్‌ కొడుకు వేదాంత్‌ జాతీయ స్థాయి స్విమ్మింగ్‌లో విశేష ప్రతిభ చూపించారు. జూనియర్‌ లెవల్‌లో జాతీయ స్విమ్మింగ్‌ చాంపియన్‌ షిప్‌లో విజయం సాధించారు. దీనికి సంబంధించిన వీడియోను మాధవన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అదే విధంగా ‘మీ అందరి దీవెనలలో వేదాంత్‌ ఈ పోటీల్లో గెలిచాడు. వేదాంత్‌ విజయానికి గర్వపడుతున్నా.  దేవుడి దయ వల్ల అతనికి ఈ విజయాలు లభించాయి. తన ఆటను టీవీ లైవ్‌లో చూడటం చాలా ఉత్సాహంగా ఉంది’  అంటూ కామెంట్‌ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

కాగా , 2019 సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా ఏజ్ గ్రూప్ ఛాంపియన్‌షిప్‌లో వేదాంత్‌ భారత్ తరఫున రజత పతకం సాధించాడు. ఇవే కాకుండా వేదాంత్‌ పలు పోటీల్లో విజయం సాధించాడు. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉ‍న్న ‘నిశ్శబ్దం’ సినిమాలో మాధమన్‌ నటించారు. ఈ సినిమాకు హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అనుష్క, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, మైఖేల్‌ మ్యాడిసన్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. అదేవిధంగా  దర్శకుడు దిలీప్ కుమార్ తెరకెక్కించే ‘ మారా ’ సినిమా చిత్రీకరణలో మాధవన్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో మాధవన్‌ సరసన శ్రద్ధా శ్రీనాథ్‌ హిరోయిన్‌గా నటిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement