రీల్ సైంటిస్ట్‌.. రియల్‌ సైంటిస్ట్‌

Madhavan Look in Nambi Narayanan Biopic Rocketry - Sakshi

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల సీజన్‌ నడుస్తోంది. సినీ రాజకీయా క్రీడా ప్రముఖుల జీవిత కథల నేపథ్యంలో పలు భాషల్లో సినిమాలు రూపొందుతున్నాయి.  ఈ లిస్ట్‌లో ఓ సైంటిస్ట్‌ కూడా చేరబోతున్నాడు.ఆర్‌ మాధవన్‌ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న సినిమా రాకెట్రీ. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా కోసం మాధవన్ చూపిస్తున్న డెడికేషన్‌ అందరిని విస్మయానికి గురిచేస్తుంది. ఇప్పటికే తన లుక్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌తో ఆకట్టుకుంటున్న మాధవన్‌ తాజాగా తన ఫైనల్‌ లుక్‌ను రివీల్ చేశాడు. అచ్చు నంబి నారాయణన్‌లా మారిపోయాడు మాధవన్‌. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top