ఓ డ్రైవర్‌ ప్రేమకథ | Maa Oori Prema Katha movie to release in August | Sakshi
Sakshi News home page

ఓ డ్రైవర్‌ ప్రేమకథ

Jul 6 2019 12:30 AM | Updated on Jul 6 2019 12:30 AM

Maa Oori Prema Katha movie to release in August - Sakshi

మంజునాథ్‌, తనిష్క్‌ తివారి

మంజునాథ్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మా ఊరి ప్రేమకథ’. తనిష్క్‌ తివారి కథానాయిక. శ్రీ మల్లికార్జునస్వామి క్రియేషన్స్‌పై లక్మిదేవి, మహేంద్రనాథ్‌ నిర్మించా రు. లక్ష్మిదేవి, మహేంద్రనాథ్‌ మాట్లాడుతూ– ‘‘లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా గ్రామీణ నేపథ్యంలో నిర్మించిన చిత్రమిది. కథ, కథనాలు ఆకట్టుకుంటాయి.

సెంటిమెంట్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌.. ఇలా అన్నీ ఉన్నాయి. ఆగస్టులో సినిమాని రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నీళ్ల ట్యాంకర్‌  డ్రైవర్‌గా నటించాను. నీళ్లు పట్టుకోవడానికి వచ్చిన ఒక అమ్మాయిని ప్రేమిస్తాను. డ్రైవర్‌ ప్రేమని ఆ అమ్మాయి ఒప్పుకుందా? లేదా? అనేది కథ. గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. జయసూర్య మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు’’ అన్నారు మంజునాథ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement